Gold Price Crash: మరోసారి కుప్పకూలిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Gold Price Crash: బంగారం.. సామాన్యుడికి ఇదొక సెంటిమెంట్, ఇన్వెస్టర్‌కు ఇదొక ఆయుధం. కానీ గత కొద్దిరోజులుగా పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి.

Naresh.k
Published on: 3 Feb 2026 7:59 AM IST
Gold Price Crash: మరోసారి కుప్పకూలిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
X

Gold Price Crash: మరోసారి కుప్పకూలిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Gold Price Crash: బంగారం.. సామాన్యుడికి ఇదొక సెంటిమెంట్, ఇన్వెస్టర్‌కు ఇదొక ఆయుధం. కానీ గత కొద్దిరోజులుగా పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. ఒకప్పుడు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన గోల్డ్ రేట్లు, ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత మొదలైన ఈ 'గోల్డ్ క్రాష్' మార్కెట్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. బంగారం ధరలు గత నాలుగైదు రోజులుగా భారీగా కుప్పకూలుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌లో రాబోయే మార్పులు పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా కొత్త ఛైర్మన్ నియామకంపై వస్తున్న వార్తలు ఇన్వెస్టర్ల ఆలోచనా దృక్పథాన్ని మార్చేశాయి. దీనికి తోడు కేంద్ర బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలు దేశీయంగా ధరలు తగ్గడానికి ప్రధాన కారణమయ్యాయి.

ఎక్కడ ఎంత తగ్గింది?

మంగళవారం నాటి ధరలను పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా పసిడి స్వల్పంగా తగ్గింది లేదా స్థిరంగా కొనసాగింది.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 1,53,160 - 1,53,170 మధ్య ఊగిసలాడుతోంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 1,40,390 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,53,310 గా ఉంది. నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.చెన్నైలో ధరలు మిగిలిన నగరాల కంటే కాస్త తక్కువగా రూ. 1,52,170 వద్ద ఉన్నాయి. బెంగళూరులో కూడా ఇవే ట్రెండ్స్ కనిపిస్తున్నాయి.

వెండి కూడా వెనక్కి..

కేవలం బంగారమే కాదు, వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. ఒకప్పుడు కిలో రూ. 3 లక్షల మార్కును తాకిన వెండి, ఇప్పుడు రూ. 2,99,900 వద్ద స్థిరపడింది. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై ఇలా అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు దాదాపు ఒకే స్థాయిలో కనిపిస్తున్నాయి.

బంగారం ధరలు తగ్గుతుండటం శుభపరిణామమే అయినా, డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ ఈటీఎఫ్ లలో భారీగా పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ధరలు మళ్లీ పెరిగినప్పుడే లాభాలు స్వీకరించాలని వేచి చూస్తున్నారు. అయితే, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో, నగలు చేయించుకోవాలనుకునే సామాన్యులకు మాత్రం ఈ ధరల తగ్గింపు ఒక గొప్ప ఊరట అనే చెప్పాలి. అంతర్జాతీయ రాజకీయ సంక్షోభాలు సమసిపోయి, ఆర్ధిక అనిశ్చితి తొలగితే తప్ప బంగారం ధరల్లో మళ్లీ పాత జోరు కనిపించకపోవచ్చు. అప్పటివరకు ఈ బంగారు అవకాశం వినియోగించుకోవడం ఉత్తమమని నిపుణులు భావిస్తున్నారు.

Naresh.k

Naresh.k

Next Story