భారీగా కుంగిన బంగారం దిగుమతులు

భారీగా కుంగిన బంగారం దిగుమతులు
x
Highlights

కరోనా సంక్రమణ కారణంగా బంగారు దిగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 57 శాతం తగ్గాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం..

కరోనా సంక్రమణ కారణంగా బంగారు దిగుమతులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 57 శాతం తగ్గాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో 6.8 బిలియన్ డాలర్ల లేదా 50,658 కోట్ల రూపాయల బంగారం దిగుమతి జరిగింది. ఏడాది క్రితం ఇదే కాలంలో 15.8 బిలియన్ డాలర్లు లేదా 1,10,259 కోట్ల రూపాయలు దిగుమతి అయ్యాయి. అలాగే మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, వెండి దిగుమతులు సైతం ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబర్‌లో ఏకంగా 63.4 శాతం పతనమయ్యాయి.

బంగారం, వెండి దిగుమతుల తగ్గింపు దేశ వాణిజ్య లోటుకు మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యలో, 23.44 బిలియన్ డాలర్ల దిగుమతి-ఎగుమతి ఉంది. ఏడాది క్రితం ఇదే కాలంలో 88.92 బిలియన్ డాలర్ల దిగుమతి-ఎగుమతి జరిగింది.. ఇది దేశ వాణిజ్య లోటు ఊరట కలిగించింది. ప్రపంచంలో అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునేది భారత్. ప్రతి సంవత్సరం 800-900 టన్నుల బంగారం ఇక్కడ దిగుమతి అవుతుంది. కరోనా కారణంగా 2020 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో జేమ్స్, జ్యువెలరీ ఎగుమతులు 55 శాతం తగ్గాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories