Cardless cash withdrawal: జేబులో కార్డు లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు.. ఈ సింపుల్ ట్రిక్స్ మీకు తెలుసా?

Cardless cash withdrawal
x

Cardless cash withdrawal: జేబులో కార్డు లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు.. ఈ సింపుల్ ట్రిక్స్ మీకు తెలుసా?

Highlights

Cardless cash withdrawal: ఈ ఆధునిక సాంకేతిక యుగంలో బ్యాంకుల ముందు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు.

Cardless cash withdrawal: ఈ ఆధునిక సాంకేతిక యుగంలో బ్యాంకుల ముందు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఏటీఎంల ద్వారా ఎంత అవసరమో అంత డబ్బులు తీసుకోవచ్చు. అయితే, కొన్నిసార్లు మనం తొందరలోనో, లేదంటే పొరపాటునో డెబిట్ కార్డు ఇంట్లో మర్చిపోతాం. అర్జెంట్‌గా డబ్బులు అవసరమైతే ఏం చేయాలో తెలియక తికమక పడుతుంటాం. నిజానికి ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలో వచ్చిన మార్పులతో కార్డు లేకుండానే సులభంగా డబ్బులు డ్రా చేయవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆధార్ కార్డు ఉంటే చాలు.. డబ్బులు మీ చేతికి!

మీకు ఏటీఎం కార్డు లేకపోయినా మీ ఆధార్ కార్డు ఇప్పుడు ఆపద్బాంధవుడిలా పని చేస్తుంది. దీనినే 'ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్' (AePS) అంటారు. దీని ద్వారా డబ్బులు తీసుకోవడం చాలా సులభం. దీని కోసం మీరు మెయిన్ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లక్కర్లేదు. మీ గ్రామంలో లేదా ఏరియాలో ఉండే 'బిజినెస్ కరస్పాండెంట్' (BC) లేదా మైక్రో ఏటీఎంలు నిర్వహించే వారిని సంప్రదిస్తే సరిపోతుంది.

ఆధార్ కార్డు డబ్బులను ఎలా విత్‌డ్రా చేయాలంటే..

ముందుగా మైక్రో ఏటీఎం వద్దకు వెళ్లి కాష్ విత్ డ్రా ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత అక్కడ అడిగిన వివరాల ప్రకారం మీ ప్రాంతం పిన్ కోడ్ నమోదు చేయాలి. ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. లాస్ట్‌గా ఫింగర్ స్కానర్‌పై మీ తంబ్‌ను ఉంచాలి. మీ బయోమెట్రిక్ వివరాలు మ్యాచ్ అయితే, మీ లావాదేవీ కంప్లీట్ అవుతుంది. తర్వాత అక్కడ ఉన్న ఏజెంట్ మీకు డబ్బులను అందజేస్తారు.

UPI స్కానింగ్‌తో కూడా..

ఆధార్ మాత్రమే కాకుండా, ఈ మధ్య కాలంలో చాలా బ్యాంకులు UPI QR కోడ్ ఫీచర్‌ను ఏటీఎంలలో అందుబాటులోకి తెచ్చాయి. దీనికి ఏం చేయాలంటే ముందుగా మీరు ఏటీఎం సెంటర్‌కు వెళ్లి.. ఏటీఎం స్క్రీన్‌పై ఉన్న 'QR Code' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ మొబైల్‌లోని PhonePe, Google Pay లేదా మరేదైనా UPI యాప్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేయాలి. అనంతరం మీరు విత్‌డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని ఎంటర్ చేసి, మీ మొబైల్‌లో UPI పిన్ కొడితే చాలు.. ఏటీఎం మెషీన్ నుంచి డబ్బులు బయటకు వస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories