Yono ID లేదా పాస్‌వర్డ్‌ని మరిచిపోయారా..! ఇలా తెలుసుకోండి..

Forgot Yono ID or Password Find Out SBI has Given Complete Information | SBI Latest Update
x

Yono ID లేదా పాస్‌వర్డ్‌ని మరిచిపోయారా..! ఇలా తెలుసుకోండి..

Highlights

Yono App: ప్రతి ఒక్కరికి చాలా రకాల ఖాతాలు ఉంటాయి ప్రతిదాని ID పాస్వర్డ్ను గుర్తుంచుకోవడం చాలా కష్టమైన పని...

Yono App: బ్యాంకు లావాదేవీలు సులువుగా చేయడానికి అంతేకాకుండా రక్షణ పెంచడానికి దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ Yono appని ప్రవేశపెట్టింది. ఈ యాప్‌ వచ్చినప్పటి నుంచి ఎస్బీఐ ఖాతాదారులకు సులువుగా పనులు జరిగిపోతున్నాయి. బ్యాంకులకి రాకుండా ఇంటి వద్దనే ఈ యాప్‌ని ఉపయోగించి లావాదేవీలు పూర్తి చేస్తున్నారు.

ఎంతో సమయాన్ని ఆదా చేసుకుంటున్నారు. అయితే ప్రతి ఒక్కరికి చాలా రకాల ఖాతాలు ఉంటాయి ప్రతిదాని ID పాస్వర్డ్ను గుర్తుంచుకోవడం చాలా కష్టమైన పని. అలాంటి సమయంలో కొన్నింటి ID పాస్వర్డ్నులను మరిచిపోతారు. అయితే ఒకవేళ మీరు ఎస్బీఐ యోనో యాప్‌ ఐడీ, పాస్‌వర్డ్ మరిచిపోతే ఎలా..? దీని గురించి బ్యాంకు పూర్తి సమాచారం అందించింది. అదేంటో తెలుసుకుందాం.

ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ SBIని ఇలా అడిగాడు. "నేను నా YONO ID, పాస్‌వర్డ్‌ను మరిచిపోతే ఎలా తిరిగి పొందగలను" అని ప్రశ్నించాడు. కస్టమర్ అడిగిన ఈ ప్రశ్నకు SBI తన ట్టిట్టర్‌ ఖాతా ద్వారా సమాధానమిచ్చింది. "మీ యూజర్ ఐడిని తిరిగి పొందడానికి, పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడానికి SBI వెబ్‌సైట్ http://www.sbi.gov.in ని సంప్రదించాలి. లేదా మీ హోమ్ బ్రాంచ్‌లో అధికారులను కలవండి. లేదంటే హెల్ప్‌లైన్‌ //onlinesbi.comకి వెళ్లి మీ సమస్యని పరిష్కరించుకోవచ్చు. SBI ఖాతాదారుడు ఎవరైనా అలాంటి సమస్యను ఎదుర్కొంటే ఈ విధంగా సహాయం తీసుకోవచ్చు" అని తెలిపింది.

యోనో అంటే ఏమిటి?

వాస్తవానికి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నెట్ బ్యాంకింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ భద్రతా ఫీచర్‌ను తీసుకొచ్చింది. అంటే ఇతర అప్లికేషన్‌ల మాదిరిగానే ఇది కూడా బ్యాంకింగ్ అప్లికేషన్. దీని ద్వారా మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ పనిని సులువుగా చేయవచ్చు. డబ్బు బదిలీ చేయడం, బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడంతో సహా మిగతావన్నీ ఇందులో ఉంటాయి. కానీ ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ని ఉపయోగిస్తే మీరు మీ రిజిస్టర్డ్ నంబర్‌ను మాత్రమే నమోదు చేయాలి. ఇది లేకుండా మీరు దీన్ని ఏ విధంగాను యాక్సెస్ చేయలేరని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories