Indian Wine: భారతీయ మద్యానికి విదేశాల్లో భారీ డిమాండ్..5 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన వ్యాపారం..!

Foreigners Thirsty for Indian Liquor Business to Triple in 5 Years
x

Indian Wine: భారతీయ మద్యానికి విదేశాల్లో భారీ డిమాండ్..5 ఏళ్లలో 3 రెట్లు పెరిగిన వ్యాపారం..!

Highlights

Indian Wine: భారతీయ మద్యానికి ప్రపంచ మార్కెట్లలో అపారమైన అవకాశాలు ఉన్నాయని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) ఛైర్మన్ అభిషేక్ దేవ్ బుధవారం అన్నారు.

Indian Wine: భారతీయ మద్యానికి ప్రపంచ మార్కెట్లలో అపారమైన అవకాశాలు ఉన్నాయని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) ఛైర్మన్ అభిషేక్ దేవ్ బుధవారం అన్నారు. జిన్, బీర్, వైన్ , రమ్ వంటి అనేక ఉత్తమ ఉత్పత్తులు దేశం వద్ద ప్రపంచానికి అందించడానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశం మద్యం ఎగుమతులు ప్రస్తుతం ఉన్న 37.05 కోట్ల డాలర్ల నుండి 2030 నాటికి 100 కోట్ల డాలర్లకు చేరుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జిన్, బీర్, వైన్, రమ్‌కు పెరిగిన డిమాండ్

ఇక్కడ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీస్ (CIABC) నిర్వహించిన ఆల్కోబేవ్‌ ఇండియాలో దేవ్ మాట్లాడుతూ.. ఎగుమతులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని, వివిధ రకాల జిన్, బీర్, వైన్, రమ్ వంటి అనేక మంచి ఉత్పత్తులు మన వద్ద ఉన్నాయని తెలిపారు. వీటికి చాలా డిమాండ్ ఉందని ఆయన పేర్కొన్నారు.

డిమాండ్ కాదు.. సరఫరా పెంచాల్సిన అవసరం

ఎగుమతులను ప్రోత్సహించడానికి కొత్త మార్కెట్లను అన్వేషించాలని, దేశీయ మార్కెట్‌తో సంతృప్తి చెందవద్దని దేవ్ పరిశ్రమకు సూచించారు. ఆస్ట్రేలియాతో సేంద్రియ ఉత్పత్తుల కోసం పరస్పర గుర్తింపు ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు భారత్ చేరువలో ఉందని, అందులో సేంద్రియ వైన్ కూడా ఉందని APEDA ఛైర్మన్ తెలిపారు.

సమావేశంలో ఆహార ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి సుబ్రత గుప్తా మాట్లాడుతూ.. పరిశ్రమ విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించాలని, పండ్లు, కూరగాయల వ్యర్థాలను నివారించాలని కోరారు. భారత్ అనేక వ్యవసాయ ఉత్పత్తులను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నప్పటికీ, వాటిని ప్రాసెస్ చేసే సామర్థ్యం విషయంలో మనం అదే స్థాయిలో లేమని ఆయన అన్నారు. మద్య పానీయాల ఎగుమతులను పెంచాలని కూడా ఆయన కోరారు. ఈ పరిశ్రమకు చాలా అవకాశాలు ఉన్నాయని, ఎందుకంటే దీని ద్వారా విలువైన విదేశీ మారకద్రవ్యం వస్తుందని గుప్తా అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories