Flipkart Dussehra Sale: ఫ్లిప్‌కార్ట్‌ దసరా సేల్‌.. అక్టోబర్ 5 నుంచి 8 వరకు..!

Flipkart Dussehra Sale from October 5 to 8
x

Flipkart Dussehra Sale: ఫ్లిప్‌కార్ట్‌ దసరా సేల్‌.. అక్టోబర్ 5 నుంచి 8 వరకు..!

Highlights

Flipkart Dussehra Sale: ఫ్లిప్‌కార్ట్‌ దసరా సేల్‌.. అక్టోబర్ 5 నుంచి 8 వరకు..!

Flipkart Dussehra Sale: దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా ఈ కామర్స్‌ సైట్స్‌ అద్భుత ఆఫర్లని ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్‌ డే సేల్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్స్‌, ల్యాప్‌టాప్స్‌తో పాటు మరిన్ని ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లపై భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఈ ఆఫర్‌ ఇటీవలే ముగిసింది. అయితే తాజాగా ఇప్పుడు మరో సేల్‌ ప్రకటించింది.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దసారా సేల్‌ పేరుతో అక్టోబర్‌ 5 నుంచి 8వ తేదీ వరకు ఈ సేల్ ప్రారంభించనుంది. ఫ్లిప్‌ కార్డ్‌ ప్లస్‌ సభ్యులకు ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 4 నుంచే సేల్ ప్రారంభం కానుంది. అయితే ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లపై 80 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపింది. ఇక స్మార్ట్‌ టీవీలపై 75 శాతం డిస్కౌంట్‌ అందిస్తున్నారు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ దక్కుతుంది. ఈఎమ్‌ఐ లావాదేవీలు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌ విధానంలో కొనుగోలు చేసే వారికి కూడా ఆఫర్లు వర్తిస్తాయి. ఈ సేల్‌లో ఐఫోన్‌ 13పై భారీ డిస్కౌంట్‌ ఉండనున్నట్లు సమాచారం. ఈ సేల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు అక్టోబర్‌ 4న తెలుస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories