Fine for Littering in Trains: రైళ్లలో చెత్త వేస్తే..ఇక భారీగా జరిమానా కట్టాల్సిందే

Fine for Littering in Trains
x

Fine for Littering in Trains: రైళ్లలో చెత్త వేస్తే..ఇక భారీగా జరిమానా కట్టాల్సిందే

Highlights

Fine for Littering in Trains: చాలామంది రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడే తినేసి.. అక్కడే చెత్త వేసేస్తూఉంటారు. ఇక నుంచి ఇలా చేస్తే భారీగా ఫైన్ కట్టాల్సి వస్తుంది. స్వచ్చభారత్‌లో భాగంగా రైల్వే శాక కొన్ని కొత్త రూల్స్‌ని తీసుకొచ్చింది.

Fine for Littering in Trains: చాలామంది రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడే తినేసి.. అక్కడే చెత్త వేసేస్తూఉంటారు. ఇక నుంచి ఇలా చేస్తే భారీగా ఫైన్ కట్టాల్సి వస్తుంది. స్వచ్చభారత్‌లో భాగంగా రైల్వే శాక కొన్ని కొత్త రూల్స్‌ని తీసుకొచ్చింది. రైళ్లలో గానీ, రైళ్ల పట్టాలపైన గానీ, రైల్వే స్టేషన్‌లలో గానీ ఎక్కడైనా ఒక చిన్న చెత్త ముక్క వేసినా .. భారీ స్థాయిలో ఫైన్ కట్టాల్సిందే.

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ... మన భారతీయ రైల్వే వ్యవస్థ. అయితే ఇప్పటిరకు శుభ్రత విషయంలో ఎటువంటి నిబంధనలు లేవు. ఉన్నా ఎవరూ సరిగా పట్టించుకోలేదు. కానీ ఇక నుంచి అలా కుదరదు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని స్వచ్చ భారత్ మిషన్‌లో భాగంగా కొత్త నిబంధనలను రైల్వే శాఖ తీసుకొచ్చింది. పర్యావరణానికి నష్టం కలిగే విధంగా ఎటువంటి చర్యకు పాల్బడినా జరిమానాలు విధిస్తోంది. అందుకే ఇక నుంచి రైళ్లలో చెత్త వేయకుండా చూసుకోండి. లేదంటే మీ జేబులు చిల్లలు పడే ఛాన్స్ ఉంది.

జరిమానా వివరాలు

రైళ్లలో చెత్త పారేస్తే.. ఇదొక తీవ్రమైన చర్యగా పరిగణిస్తారు. రైల్వే రక్షణ దళం ఎప్పటికప్పుడు ప్రయాణికులను కనిపెట్టుకుని ఉంటుంది. రైల్వే భోగి, ఫ్లాట్ ఫామ్, పట్టాలు.. ఈ మూడు ప్రదేశాల్లో ఎక్కడ చెత్త వేసినా.. వారిపై రూ. 500 నుంచి రూ. 1000 వరకు ఫైన్ పడుతుంది. అయితే ఇది పెరిగే అవకాశం కూడా ఉంది. చెత్త పరిమాణాన్ని బట్టి ఫైన్ ఉంటుంది. చెత్త తీవ్రతను బట్టి ఫైన్ ఉంటుంది. ఫైన్ వేసిన తర్వాత చాలామంది తన దగ్గర డబ్బులు లేవని అంటారు. అప్పుడు కూడా ముక్కుపిండి పోలీసులు వసూలు చేస్తారు.

కొన్ని సార్లు పట్టాలపై వాటర్ బాటిళ్లు, పెద్ద పెద్ద డబ్బాలు వంటివి పడేస్తూ ఉంటారు. అంటే ఆహార పదార్దాలు తిన్న డబ్బాలు, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ డబ్బాలు.. ఇలాంటివి పట్టాల దగ్గరలో పడేస్తే.. జరిమానా రూ.1000 నుండి 5000 రూపాయల వరకు ఉంటుంది. ఈ రూల్స్‌తో రైళ్లు శుభ్రంగా ఉండటమే కాదు.. పర్యావరణాన్ని పరిరక్షించే వాళ్లు కూడా అవుతారని అధికారులు చెబుతున్నారు.

ఇప్పిటికే పలు చోట్ల జరిమానాలు విధిస్తున్నారు. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఒక ప్రయాణికుడు ప్లాస్టిక్ వ్యర్ధాలను రైల్వే పట్టాలపై పడేశాడు. అది గమనించిన పోలీసులు వెంటనే అతని వద్దకు వచ్చి.. ఫైన్ వేశారు. దీంతో చేసేదేమీ లేక 2వేల రూపాయలు కట్టాడు. మరొక వ్యక్తి ఇలానే చెత్త వేయడంతో అతనిపై కూడా వెయ్యి రూపాయల ఫైన్ పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories