Credit Card Bill: క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేని పరిస్థితి ఎదురైందా.. ఈ ప్లాన్‌ అమలు చేయండి..!

Faced With A Situation Of Not Being Able To Pay The Credit Card Bill Implement This Plan
x

Credit Card Bill:క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లించలేని పరిస్థితి ఎదురైందా.. ఈ ప్లాన్‌ అమలు చేయండి

Highlights

Credit Card Bill: నేటి కాలంలో చాలామంది ఉద్యోగులు క్రెడిట్‌ కార్డులపై ఆధారపడి బతుకుతున్నారు.

Credit Card Bill: నేటి కాలంలో చాలామంది ఉద్యోగులు క్రెడిట్‌ కార్డులపై ఆధారపడి బతుకుతున్నారు. ఒక్కొక్కరు రెండు లేదా మూడు క్రెడిట్‌ కార్డులు మెయింటెన్‌ చేస్తున్నారు. చేతిలో డబ్బు లు లేకపోయినా వీటిద్వారా అవసరమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల అనవసర ఖర్చులు పెరిగి చివరకు ఆ బిల్లు చెల్లించలేని పరిస్థితులు దాపురిస్తున్నాయి. ఇలా జరిగినప్పు డు ఒక మార్గం ఉంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

క్రెడిట్‌ కార్డు బిల్లు సరైన సమయంలో చెల్లించకుంటే కొన్ని పద్దతులు పాటించాలి. కొనుగోలు చేసిన వస్తువుల మొత్తాన్ని ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు. లేదా ఆ బిల్లును వేరే కార్డుకు బదిలీ చేయొచ్చు. ఇవి రెండూ కుదరకుంటే మొత్తం బిల్లును పర్సనల్‌ లోన్‌ కిందికి కన్‌వర్ట్‌ చేసుకొని వాయిదాల పద్దతిలో చెల్లించుకోవచ్చు. క్రెడిట్‌ కార్డు బాకీని పర్సనల్‌ లోన్‌ కిందికి మార్చినప్పుడు ఆర్థికంగా చిక్కులు తప్పుతాయి. ఈ రుణాన్ని సులభంగా వాయిదాల్లో తీర్చేందుకు వీలవుతుంది. ఫలితంగా వడ్డీ, ఇతర రుసుములను తగ్గుతాయి.

పర్సనల్‌ లోన్స్‌ వడ్డీ క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. కాలక్రమేణా వడ్డీపై డబ్బు ఆదా అవుతుంది. అంతేకాకుండా బాకీని వేగంగా తీర్చేందుకు ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు క్రెడిట్‌ కార్డ్‌ బిల్లును చెల్లించుకుండా అలాగే ఉంటే క్రెడిట్‌ స్కోరు పడిపోతుంది. దీనికి బదులుగా రుణంతో ఒకేసారి బాకీ తీరిస్తే క్రెడిట్‌ స్కోరు మెరుగయ్యే అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో మీకు మళ్లీ లోన్‌ లభిస్తుంది. అయితే క్రెడిట్‌ కార్డు బిల్లును తీర్చేందుకు పర్సనల్‌ లోన్‌ తీసుకునేందుకు మీకు అర్హత ఉందా అనేది తెలుసుకోవాలి. ఇందుకోసం మీరు ముందుగా బ్యాంకును సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories