చెల్లింపుల సేవల రంగంలోకి ఫేస్‌బుక్‌.. అందుబాటులోకి వచ్చిన ఫేస్‌బుక్‌ పే

చెల్లింపుల సేవల రంగంలోకి ఫేస్‌బుక్‌.. అందుబాటులోకి వచ్చిన ఫేస్‌బుక్‌ పే
x
Highlights

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఇప్పుడు చెల్లింపుల సేవల రంగంలోకి దిగింది. ఫేస్‌బుక్‌ పేను అమెరికాలో అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు సులువైన,...

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఇప్పుడు చెల్లింపుల సేవల రంగంలోకి దిగింది. ఫేస్‌బుక్‌ పేను అమెరికాలో అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు సులువైన, సురక్షితమైన, నమ్మకమైన చెల్లింపులు జరపడానికి వీలుగా ఈ సేవను ప్రారంభిస్తున్నట్టు ఫేస్‌బుక్‌ ప్రకటించింది. దీని ద్వారా కొనుగోళ్లు, చెల్లింపులతో పాటు విరాళాలు, నగదు లావాదేవీలను కూడా చేసుకోవచ్చు. దీనిని ఫేస్‌బుక్‌లో మాత్రమే కాకుండా మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లలో కూడా వినియోగించుకోవచ్చు. కాకపోతే దీనిని వాడటానికి ఫేస్‌బుక్ ఖాతా తప్పనిసరి.

'రానున్న కాలంలో ఫేస్‌బుక్ పే సర్వీసులను ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తామని ఫేస్‌బుక్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెట్‌ప్లేస్ అండ్ కామర్స్) డెబోరాహ్ లియు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ యూజర్లకు కూడా ఈ సర్వీసులను అందిస్తామని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories