EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకి శుభవార్త.. త్వరలో ఈ ప్రయోజనం..!

EPFO Update News the Money Will Be Credited to Subscribers Accounts from June 16
x

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకి శుభవార్త.. త్వరలో ఈ ప్రయోజనం..!

Highlights

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకి శుభవార్త.. త్వరలో ఈ ప్రయోజనం..!

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకి త్వరలో ఓ శుభవార్త అందనుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రాబోయే కొద్ది రోజుల్లో 2022 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ఖాతాకు 8.1 శాతం వడ్డీని జమచేయబోతుంది. ఈ డబ్బు పీఎఫ్ పరిధిలోకి వచ్చే దేశంలోని దాదాపు 7 కోట్ల మంది ఉద్యోగుల ఖాతాలకు బదిలీ అవుతుంది.

ఇప్పటికే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీని గుణించే ప్రక్రియని పూర్తి చేసింది. జూన్ 16 నుంచి చందాదారుల ఖాతాల్లో డబ్బు జమ అవడం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు 2.5 నుంచి 5 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుంది. మొత్తం రూ.72,000 వేల కోట్ల సబ్‌స్క్రైబర్లకు వడ్డీ జమ చేస్తారు. గతేడాది ఈ మొత్తం రూ.70,000 కోట్లు.

2021 ఆర్థిక సంవత్సరానికి వడ్డీని పొందడానికి చాలా మంది చందాదారులు చివరిసారిగా 6 నుంచి 8 నెలల వరకు వేచి ఉండాల్సి వచ్చింది. కానీ EPFO 22 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేట్లను 8.1 శాతం వద్ద ఉంచాలని నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరంలో 2019-20, కేవైసీ కారణంగా చాలా మంది చందాదారులు డబ్బు కోసం వేచి ఉండాల్సి వచ్చింది. మీరు మీ PF బ్యాలెన్స్‌ని ఇలా చెక్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి EPFO వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి. epfindia.gov.inలో ఈ-పాస్‌బుక్‌పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఈ-పాస్‌బుక్‌పై క్లిక్ చేస్తే passbook.epfindia.gov.in అనే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ మీరు మీ వినియోగదారు పేరు (UAN నంబర్), పాస్‌వర్డ్, క్యాప్చా ఎంటర్‌ చేయాలి. అన్ని వివరాలను నింపిన తర్వాత మీరు కొత్త పేజీలోకి వెళుతారు. ఇక్కడ సభ్యుల IDని ఎంచుకోవలసి ఉంటుంది. మీరు E-పాస్‌బుక్‌లో మీ EPF బ్యాలెన్స్‌ని చూస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories