EPFO : ఈపీఎఫ్ఓ సభ్యులకు శుభవార్త.. త్వరలో వడ్డీ రేటు పెరిగే అవకాశం

EPFO Members to Get Higher Interest Rate Soon Expected Hike in Provident Fund Interest
x

EPFO : ఈపీఎఫ్ఓ సభ్యులకు శుభవార్త.. త్వరలో వడ్డీ రేటు పెరిగే అవకాశం

Highlights

EPFO: 2025లో ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు వరుసగా శుభవార్తలను అందజేస్తుంది.

EPFO: 2025లో ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు వరుసగా శుభవార్తలను అందజేస్తుంది. కేంద్ర బడ్జెట్‌లో పన్ను తగ్గింపు నుండి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు వరకు మధ్య తరగతికి భారీగా మేలు జరుగనుంది. తాజాగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే కొన్ని నెలల్లో ఈపీఎఫ్ఓలో జమ చేసిన తమ ఫండ్లపై మరింత వడ్డీ పొందే అవకాశం ఉండవచ్చని తెలిపింది.

ఈపీఎఫ్ఓలో పెరగనున్న వడ్డీ రేటు

PF (ప్రొవిడెంట్ ఫండ్) ఉద్యోగి నిధి, ఉద్యోగుల పెద్ద మొత్తంలో పొదుపుగా చెప్పుకోవచ్చు. ఈ పొదుపు మీద వడ్డీ కూడా చెల్లిస్తుంది. ప్రస్తుతం, ప్రభుత్వం పీఎఫ్ వడ్డీ రేటును పెంచే ఆలోచనలో ఉంది. ఇది ఉద్యోగుల పొదుపులో మరింత వృద్ధిని తీసుకువస్తుంది.

ఫిబ్రవరి 28న బోర్డు సమావేశం

ఈపీఎఫ్ఓకి సంబంధించిన అన్ని నిర్ణయాలు ఈపీఎఫ్ఓ బోర్డు ద్వారా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో బోర్డు వచ్చే సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోనుంది. ఈ సమావేశం ఫిబ్రవరి 28, 2025 న జరగనుంది. దీనిలో వడ్డీ రేట్ల పెంపుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే గతంలో పెరిగిన వడ్డీ రేటు

ఇది మాత్రమే కాదు, గత రెండు సంవత్సరాలలో కూడా ప్రభుత్వం ఈపీఎఫ్ ఓపై వడ్డీ రేట్లను పెంచింది. 2022-23 సంవత్సరంలో ప్రభుత్వం పీఎఫ్ వడ్డీ రేటును 8.15శాతానికి పెంచింది. తర్వాత 2023-24లో దీనిని మరింత పెంచి 8.25శాతం చేసింది. ప్రస్తుతం, పీఎఫ్ లో ఉద్యోగులకు 8.25శాతం వడ్డీ అందుతోంది.

వడ్డీ రేటు ఎంత పెరిగే అవకాశం?

ప్రస్తుతం, ప్రభుత్వం పీఎఫ్ పై వడ్డీ రేటును పెంచుతారో లేదో అన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, దీనిపై చర్చలు జరుగుతున్నాయి. సమాచారం ప్రకారం, ఈసారి కూడా వడ్డీ రేటులో 0.10శాతం పెరుగుదల ఉండే అవకాశం ఉంది. ఈ నిర్ణయం తీసుకుంటే సేలరీడ్ క్లాస్ ఉద్యోగులకు భారీ లాభం అందుతుంది. ఈ వడ్డీ పెరుగుదల మధ్య తరగతి ప్రజలకు ఆదాయాన్ని పెంచేందుకు, వారి పొదుపులను మరింత మెరుగుపరిచే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ నిర్ణయంతో ఉద్యోగులు తమ పొదుపులను మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories