Elon Musk: బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌పై మస్క్ కొత్త నిర్ణయం..

Elon Musk New Decision on Blue Tick Subscription
x

Elon Musk: బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌పై మస్క్ కొత్త నిర్ణయం.. 

Highlights

Elon Musk: ప్రస్తుతం హోల్డ్‌లో పెట్టామని ట్వీట్.. కొత్త కలర్‌తో ముందుకు వస్తామన్న ట్విట్టర్ అధినేత

Elon Musk: బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌పై ట్విట్ట‌ర్ అధినేత ఎల‌న్ మ‌స్క్ మరో కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం స‌బ్‌స్క్రిప్ష‌న్ విధానాన్ని నిర‌వ‌ధికంగా వాయిదా వేస్తున్న‌ట్లు తెలిపారు. ట్విట్ట‌ర్‌లో ఫేక్ అకౌంట్ల అంశం తేలే వ‌ర‌కు బ్లూటిక్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఆపేస్తున్న‌ట్లు చెప్పారు. కొత్త‌గా బ్లూటిక్ విధానాన్ని ఆవిష్క‌రించాల‌నుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌స్తుతం హోల్డ్‌లో పెట్టామ‌ని, సంస్థ కోసం మ‌రో క‌ల‌ర్‌తో ఆ విధానాన్ని అమ‌లు చేయ‌నున్న‌ట్లు మ‌స్క్ ట్విట్‌ చేశారు. ఆ కొత్త స‌ర్వీసు విధానాన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తార‌న్న‌ విష‌యాన్ని మాత్రం స్ప‌ష్టం చేయ‌లేదు. బ్లూటిక్ విధానం ఈనెల 29 నుంచి ట్విట్ట‌ర్‌లో క‌నిస్తుంద‌ని తొలుత మ‌స్క్ తెలిపారు. కానీ తాజా ట్వీట్‌తో ఆ విధానం నిలిపివేసిన‌ట్లు అయ్యింది. సెల‌బ్రిటీలు, భారీ బ్రాండ్ సంస్థ‌ల పేర్ల‌తో ఫేక్ అకౌంట్లు తీస్తున్న నేప‌థ్యంలో 8 డాల‌ర్ల బ్లూటిక్ విధానాన్ని ట్విట్ట‌ర్ నిలిపివేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories