కొత్త రికార్డు నెలకొల్పిన స్టాక్ మార్కెట్లు

కొత్త రికార్డు నెలకొల్పిన స్టాక్ మార్కెట్లు
x
Highlights

దేశీయ మార్కెట్లు వరుసగా ఏడో రోజూ లాభాల్లో ముగిశాయి. సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నెలకొల్పాయి. కొవిడ్‌ టీకా వస్తుందన్న ఆశల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు పరుగులు పెట్టాయి.

నిఫ్టీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ రాణించాయి. సిప్లా, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, దివీస్‌ ల్యాబ్స్‌, నెస్లే షేర్లు నష్టాలు చవిచూశాయి. ఐటీ, ఫార్మా రంగాల షేర్లు మినహా మిగిలినవి రాణించాయి.

దేశీయ మార్కెట్లు వరుసగా ఏడో రోజూ లాభాల్లో ముగిశాయి. సరికొత్త జీవనకాల గరిష్ఠాలను నెలకొల్పాయి. కొవిడ్‌ టీకా వస్తుందన్న ఆశల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు పరుగులు పెట్టాయి. దీనికి తోడు బిహార్‌ ఎన్నికల ఫలితాల్లోనూ ఎన్డీయే మరోసారి అధికారంలోకి రానుందన్న వార్తలు మదుపరుల్లో జోష్‌ను నింపింది. దీంతో నిఫ్టీ 12,600 మార్కును దాటింది. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు రోజంతా అదే ఒరవడిని కొనసాగించాయి. చివరికి సెన్సెక్స్‌ 680.22 పాయింట్ల లాభంతో 43,277.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 170.05 పాయింట్లు లాభపడి 12,631 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.29గా ఉంది. నిఫ్టీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌డీఎఫ్‌సీ రాణించాయి. సిప్లా, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, దివీస్‌ ల్యాబ్స్‌, నెస్లే షేర్లు నష్టాలు చవిచూశాయి. ఐటీ, ఫార్మా రంగాల షేర్లు మినహా మిగిలినవి రాణించాయి.

మార్కెట్‌ జోష్‌కు కారణాలు..

కొవిడ్‌ టీకా : ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ కొవిడ్‌ టీకా 90 శాతం ఇన్ఫెక్షన్‌ను అడ్డుకుంటున్నట్లు ప్రకటన వెలువడటం సూచీల్లో ఉత్సాహం‌ నింపింది. అది కూడా పెద్ద స్థాయి క్లినికల్‌ పరీక్షల్లో ఈ ఫలితాలు వెలువడటం ఆశాలు రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories