స్టార్ సిరీస్ కరెన్సీ నోట్ల గురించి మీకు తెలుసా..? ఇది ఎందుకు ప్రత్యేకమైనది..

Do you know about Star Series Currency Notes Why is This Special | Telugu Online News
x

స్టార్ సిరీస్ కరెన్సీ నోట్ల గురించి మీకు తెలుసా..? ఇది ఎందుకు ప్రత్యేకమైనది..

Highlights

Star Series Notes: ఇటీవల పాత కరెన్సీ నోట్లకు, కాయిన్స్‌కి విపరీతంగా డిమాండ్‌ పెరిగింది.

Star Series Notes: ఇటీవల పాత కరెన్సీ నోట్లకు, కాయిన్స్‌కి విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. కొంతమంది వీటిని విక్రయించడం ద్వారా లక్షాధికారులవుతున్నారు. ఎందుకంటే ఇవి అరుదైనవి కాబట్టి వీటిని కొనడానికి ఔత్సాహికులు ముందుకువస్తున్నారు.

తాజాగా సోషల్ మీడియాలో స్టార్‌ సిరీస్‌ కరెన్సీ నోట్ల గురించిన సమాచారం చక్కర్లు కొడుతుంది. ఈ నోట్లు చాలా ప్రత్యేకంగా ఎలా మారాయో తెలుసుకుందాం.

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఒక రూపాయి నోటు కాకుండా అనేక రకాల నోట్లను ముద్రిస్తుంది. ఆర్థిక వ్యవస్థ ఆధారంగా ప్రతి సంవత్సరం నోట్లను ముద్రిస్తారు. ప్రతి నోటుకు ఒక సంఖ్య కారణంగా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అది ఇతర సంఖ్యతో సమానంగా ఉండదు. మీరు నోట్ నంబర్ సంఖ్య ఆధారంగా వేర్వేరు నోట్లను చూసి ఉంటారు.

RBI ముద్రించిన నోట్లలో కొన్ని నోట్లు స్టార్ సిరీస్‌లో ఉంటాయి. ప్రజలు ఈ స్టార్ సిరీస్ నోట్లని ప్రత్యేకంగా చూస్తారు. ఎందుకంటే వాటి ముద్రణ చాలా తక్కువగా ఉంటుంది.

RBI ముద్రించిన నోట్లలో స్టార్ సిరీస్‌కి చెందిన నోట్లు కూడా ఉంటాయి. వీటిని RBI ప్రత్యేకంగా పరిగణించింది. కొంతమంది నమ్మకాలు, అవసరాల ఆధారంగా కొన్ని నోట్లు ప్రత్యేకంగా మారుతాయి. స్టార్ సిరీస్‌లో నోట్లు కూడా అలాంటివే. RBI వీటిని ప్రత్యేక పద్ధతిలో ముద్రిస్తుంది. ఎందుకంటే నోట్ల కట్టలో కేవలం100 కరెన్సీ నోట్లు మాత్రమే స్టార్ సిరీస్‌లో ఉంటాయి.

అంటే దాదాపు 1000 నోట్లలో కొన్ని నోట్లు మాత్రమే స్టార్ సిరీస్‌లో ముద్రిస్తారు. ఈ నోట్ల సంఖ్యలో ప్రత్యేక సంఖ్య ఏమి ఉండదు. కానీ సంఖ్య మధ్యలో ఒక నక్షత్రం ఉంటుంది. అయితే పాత నోట్లను విక్రయించే సైట్లలో ఈ నోట్లను అధిక ధరకి విక్రయించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories