Disney Hotstar: ఐపీఎల్ దెబ్బకు డిస్నీ హాట్ స్టార్ కి చుక్కలు..3 నెలల్లో 9 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఔట్

Disney Hotstar Loses 8.4 Million Subscribers
x

Disney Hotstar: ఐపీఎల్ దెబ్బకు డిస్నీ హాట్ స్టార్ కి చుక్కలు..3 నెలల్లో 9 మిలియన్ సబ్ స్క్రైబర్లు ఔట్

Highlights

Disney Hotstar: ఐపీఎల్ టెలికాస్ట్ రైట్స్ విక్రయం తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 8.4 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ను కోల్పోయింది.

Disney Hotstar: బిజినెస్ లో కాంపిటీషన్ ఎంత తక్కువ ఉంటే సక్సెస్ రేట్ అంత ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కాంపిటీటర్స్ లేకుండా చేసుకుంటే మోనోపలియే..మొబైల్ టెలికాం రంగంలో జియో చేసింది అదే. కట్ చేస్తే ఇప్పుడు ఓటీటీ రంగంలోనూ జియో ఇదే స్ట్రాటజీతో ముందుకెళుతోంది. మొబైల్ టెలికాం రంగంలో జియో ధాటికి కొన్ని టెలికాం సంస్థలు మూత పడితే..మరికొన్ని పోటీని తట్టుకునేందుకు ఒకే ప్రొడక్ట్ గా మారాయి. ఇక ఓటీటీ రంగంలో డిస్నీ హాట్ స్టార్ కు చుక్కలు కనిపిస్తున్నాయి.

ఐపీఎల్ డిజిటల్, మొబైల్ ప్రసార హక్కులను కోల్పోయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి జియో నెట్ వర్క్ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ 2023 మొబైల్ ప్రసార హక్కులను దక్కించుకున్న జియో నెట్ వర్క్..ఐపీఎల్ మ్యాచులను జియో సినిమా యాప్ లో ఉచితంగా టెలికాస్ట్ చేస్తోంది. 4K టెక్నాలజీతో పాటు నచ్చిన యాంగిల్ లో, నచ్చిన కెమెరాలో మ్యాచులను చూసేందుకు ఆప్షన్లు కూడా ఇచ్చింది.

జియో దెబ్బకు టీవీల్లో ఐపీఎల్ మ్యాచులు చూసేవారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ కి బ్రాండ్ అంబాసిడర్ అయిన విరాట్ కోహ్లీ కూడా జియో సినిమా యాప్ లోనే క్రికెట్ మ్యాచులు చూస్తున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఏకంగా 4.6 మిలియన్ల పెయిడ్ సబ్ స్క్రైబర్లను కోల్పోయింది. ప్యాకేజ్ రెన్యువల్ చేసుకుంటున్న వారి సంఖ్య పడిపోయింది. ఐపీఎల్ టెలికాస్ట్ రైట్స్ విక్రయం తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 8.4 మిలియన్ సబ్ స్క్రైబర్స్ ను కోల్పోయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఐపీఎల్ మ్యాచులు చూసే వారి సంఖ్య 30 నుంచి 50 లక్షలు ఉండేది. అయితే జియో సినిమా యాప్ ఉచితంగా అందింస్తుండడంతో 11 నుంచి 15 మిలియన్ల మంది మ్యాచులను చూస్తున్నారు. మొత్తంగా ఐపీఎల్ కారణంగా డిస్నీ హాట్ స్టార్ కు నష్టం భారీగా ఏర్పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories