Last Date: జులై 31లోపు ఈ 3 పనులు పూర్తి చేయండి.. లేదంటే చిక్కులు తప్పవు..!

Complete these 3 Tasks Before 2023 July 31 Check Important Deadline in July 2023
x

Last Date: జులై 31లోపు ఈ 3 పనులు పూర్తి చేయండి.. లేదంటే చిక్కులు తప్పవు..!

Highlights

Deadline: జులై నెలలో అనేక పనులు ముగించేందుకు లాస్ట్ డేట్ ఉంది. మీరు సకాలంలో ఈ పని పూర్తి చేయాలి. మీరు డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేస్తుంటే.. మీరు ఈ విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి.

Last Date: జులై నెలలో అనేక పనులు ముగించేందుకు లాస్ట్ డేట్ ఉంది. మీరు సకాలంలో ఈ పని పూర్తి చేయాలి. మీరు డబ్బుకు సంబంధించిన లావాదేవీలు చేస్తుంటే.. మీరు ఈ విషయాల గురించి తప్పక తెలుసుకోవాలి. ఇందులో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి చివరి తేదీ 31 జులై 2023. జులై 2023లో ఏ పనులు పూర్తి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆదాయపు పన్ను రిటర్న్..

2023 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ 31 జులై 2023గా నిర్ణయించారు. ఆ తర్వాత మీరు ITR ఫైల్ చేయలేరు. ఒకవేళ ఆ తర్వాత మీరు చేయాలనుకుంటే జరిమానాతో ITR ఫైల్ చేయవలసి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేయడానికి చివరి గడువు 31 డిసెంబర్ 2023. దీనికి ముందు మీరు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే మీరు రిటర్న్ ఫైల్ చేయలేరు.

మీరు ITRని జులై 31 తర్వాత, డిసెంబర్ 31 లోపు ఫైల్ చేస్తే దానిని లేట్‌గా పరిగణిస్తుంటారు. ఆలస్యంగా ఐటీఆర్ దాఖలు చేసినందుకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుత పన్ను నిబంధనల ప్రకారం మీరు ITRని ధృవీకరించాలి. ఐటీఆర్ వెరిఫికేషన్‌ను 30 రోజుల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

HDFC బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్..

దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో పెట్టుబడికి చివరి తేదీ జులై 7, 2023 వరకు పొడిగించారు. పథకం కింద అందించే అత్యధిక వడ్డీ రేటు 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు 7.75 శాతంగా ఉంది. ఈ వడ్డీ రేటు రూ. 5 కోట్ల కంటే తక్కువ FDలపై ఇవ్వనున్నారు. అదే సమయంలో సీనియర్ సిటిజన్లకు 0.25 శాతం నుంచి 0.50 శాతం వరకు వడ్డీ ఇవ్వనున్నారు.

అధిక పెన్షన్ గడువు..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ కింద, అధిక పెన్షన్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అర్హులైన వ్యక్తులు జులై 11 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా ఈ తేదీని జూన్ 20న ఇవ్వగా, దానిని జులై 11 వరకు పొడిగించారు. అధిక పెన్షన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మూడుసార్లు పొడిగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories