Car Problems: కారు నిర్వహణ సరిగ్గా లేకుంటే ఈ సమస్యలు.. అవేంటంటే..?

Common problems with a car without maintenance
x

Car Problems: కారు నిర్వహణ సరిగ్గా లేకుంటే ఈ సమస్యలు.. అవేంటంటే..?

Highlights

Car Problems: కారు నిర్వహణ సరిగ్గా లేకుంటే ఈ సమస్యలు.. అవేంటంటే..?

Car Problems: మనిషైనా, కారైనా మెయింటనెన్స్‌ సరిగ్గా లేకుంటే సమస్యలు తప్పవు. అలాగే కారు కొనడం ఒకటే సరిపోదు. దాని మెయింటెనెన్స్‌ కూడా చాలా ముఖ్యం. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఒక్కోసారి రహదారి మధ్యలో ఆగిపోతుంది. లాంగ్‌ డ్రైవ్‌ వెళ్లినప్పుడు కూడా ఈ సమస్య ఎదురవొచ్చు.. అందుకే కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది. ఇంజన్‌ సౌండ్‌లో ఏమైనా తేడాఉందా.. క్లచ్‌, ఎక్సలెటర్ ఎలా ఉన్నాయి, టైర్లు బాగానే ఉన్నాయా తదితర విషయాలు అన్ని చెక్ చేసుకోవాలి. సాధారణంగా కారులో ఎదురయ్యే కొన్ని సమస్యల గురించి తెలుసుకుందాం.

సాధారణంగా ఇంజిన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. మీరు కారు ఆన్ చేసినప్పుడు ఒక్కో సారి వింత శబ్దం వస్తుంది. ఇది మిస్ ఫైరింగ్ కారణంగా వస్తుంది. అప్పుడు మీ స్పార్క్ ప్లగ్‌లను పరిశీలించాలి. అవసరమైతే వాటిని భర్తీ చేయడం కోసం మెకానిక్‌ని సంప్రదించాలి. తర్వాత డెడ్ బ్యాటరీ సమస్య ఎక్కువగా వస్తుంది. దీనికి కారణాలు బ్యాటరీ టెర్మినల్ లోపం, సిస్టమ్ వైఫల్యం, పాత బ్యాటరీ మొదలైన కారణంగా ఉంటాయి. దీనికోసం బ్యాటరీని తనిఖీ చేయాలి. లేదంటే భర్తీ చేయాలి.

క్లచ్‌ పేట్‌ సమస్య కూడా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే క్లచ్‌పేట్ చాలా సున్నితంగా ఉంటుంది. ఒక్కోసారి దీనికి ఏదైనా అడ్డుపడినప్పుడు కారు ఆగిపోతుంటుంది. క్లచ్‌ పేట్‌ కింద ఏదైనా చిక్కుకుందో చూసుకోవాలి. పెడల్ కేబుల్‌ని తనిఖీ చేయాలి. బ్రేక్‌ వేసినప్పుడు పెద్దగా శబ్దం వస్తే మీరు మెకానిక్‌ సహాయం పొందాల్సిందే. కొన్నిసార్లు తడిసిన బ్రేక్ సిస్టమ్ ఈ ధ్వనిని కలిగిస్తుంది. అలా అయితే ఆరిపోయిన వెంటనే పొడిగా మారాలి. శబ్దం చేయకూడదు. లేదంటే మెకానిక్‌కి చూపించాల్సి ఉంటుంది. అలా చేయకపోతే, వారికి ఏదో తప్పు.ఒక్కో సందర్భంలో అరిగిపోయిన బ్రేక్ ప్యాడ్‌లను భర్తీ చేస్తే మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories