Shocking Rules: నవంబర్‌ 1 నుంచి ఈ విషయాల్లో మార్పులు.. సిలిండర్‌ నుంచి జీఎస్టీ వరకు..!

Changes In These Matters From November 1 Know These Things From Cylinder To GST
x

Shocking Rules: నవంబర్‌ 1 నుంచి ఈ విషయాల్లో మార్పులు.. సిలిండర్‌ నుంచి జీఎస్టీ వరకు..!

Highlights

Shocking Rules: అక్టోబర్ నెల ముగియడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. తర్వాత నవంబర్ నెల ప్రారంభమవుతుంది. అయితే ప్రతి నెల మొదటి తేదీన చాలా విషయాలలో మార్పులు జరుగుతాయి.

Shocking Rules: అక్టోబర్ నెల ముగియడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. తర్వాత నవంబర్ నెల ప్రారంభమవుతుంది. అయితే ప్రతి నెల మొదటి తేదీన చాలా విషయాలలో మార్పులు జరుగుతాయి. ఇవి సామాన్యుడిపైనా, అతని జేబుపైనా నేరుగా ప్రభావం చూపుతాయి. నవంబర్ 1 నుంచి మీ జేబుపై ప్రభావం పడే కొన్ని విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఇందులో సిలిండర్‌ ధరల నుంచి జీఎస్టీ లెక్కల వరకు అన్నీ ఉంటాయి.

గ్యాస్ సిలిండర్ ధర

గ్యాస్ సిలిండర్ల ధరలు ప్రతి నెలా ఒకటో తేదీన మారుతాయి. ఈ రోజున నిర్ణయించే గ్యాస్ సిలిండర్ల ధరలు నెల మొత్తం ఉంటాయి. చమురు సంస్థల ప్రకారం ధరలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. అలాగే ధరలలో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు. ప్రస్తుత ధరలనే కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది.

GST నిబంధనలలో మార్పులు

నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ప్రకారం రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారాలు నవంబర్ 1 నుంచి 30 రోజులలోపు ఈ -చలాన్ పోర్టల్‌లో GST చలాన్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సెప్టెంబర్‌లో జీఎస్టీ అథారిటీ ఈ నిర్ణయం తీసుకుంది.

దిగుమతి గడువు

హెచ్‌ఎస్‌ఎన్ 8741 పరిధిలోకి వచ్చే ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతిపై ప్రభుత్వం అక్టోబర్ 30 వరకు మినహాయింపు ఇచ్చింది. అయితే నవంబర్ 1 నుంచి ఏం జరుగుతుందనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

లావాదేవీల రుసుము

నవంబర్ 1 నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో లావాదేవీల రుసుమును పెంచుతున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ అంటే బిఎస్‌ఈ అక్టోబర్ 20న ప్రకటించింది. ఈ మార్పులు S&P BSE సెన్సెక్స్ ఆప్షన్లకు వర్తిస్తాయి. పెరుగుతున్న లావాదేవీల ఖర్చులు వ్యాపారులపై, ముఖ్యంగా రిటైల్ పెట్టుబడిదారులపై నెగిటివ్‌ ప్రభావాన్ని చూపుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories