Electricity Bill: ఈ చిన్న అలవాట్లు మార్చుకోండి.. కరెంట్‌ బిల్‌ తక్కువగా వస్తుంది..!

Change these Small Habits the Current bill will be Less
x

Electricity Bill: ఈ చిన్న అలవాట్లు మార్చుకోండి.. కరెంట్‌ బిల్‌ తక్కువగా వస్తుంది..!

Highlights

Electricity Bill: చాలామంది ఇంటి కరెంట్‌ బిల్‌ ఎక్కువగా వస్తోందని బాధపడుతారు. ఇంకొంత మంది బిల్‌ ఎందుకు ఎక్కువగా వస్తోందని ఎలక్ట్రిసిటీ అధికారులతో గొడవకు దిగుతారు.

Electricity Bill: చాలామంది ఇంటి కరెంట్‌ బిల్‌ ఎక్కువగా వస్తోందని బాధపడుతారు. ఇంకొంత మంది బిల్‌ ఎందుకు ఎక్కువగా వస్తోందని ఎలక్ట్రిసిటీ అధికారులతో గొడవకు దిగుతారు. వాస్తవానికి కరెంట్ బిల్‌ ఎక్కువగా రావడానికి మీరు తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పులే కారణం. వీటిని గమనించి సరిచేసుకుంటే ఆటోమేటిక్‌గా కరెంట్ బిల్‌ తక్కువగా వస్తుంది. అయితే అలాంటి పొరపాట్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మీరు గది నుంచి బయటికి వెళ్లినప్పుడు అక్కడ లైట్ లేదా ఫ్యాన్ తిరగకుండా ఆఫ్‌ చేయండి. చాలామంది ఈ విషయాన్ని మరిచిపోతారు. కారణం లేకుండా ఇంట్లోని గృహోపకరణాలు నడిపించవద్దు. ఉపయోగంలో లేనప్పుడు రిమోట్‌తో టీవీ వంటి వాటిని ఆఫ్‌ చేయాలి. కానీ కొందరి ఇళ్లలో టీవీ ముందు ఎవరూ లేకున్నా అది నడుస్తూనే ఉంటుంది. మీరు ఇంట్లోకి కొత్త వస్తువు కొనుగోలు చేసినప్పుడల్లా దానిపై స్టార్ రేటింగ్‌ను చెక్‌ చేయండి. ఇది ఆ వస్తువు శక్తి సామర్థ్యాన్ని ప్రతిబింబించే ప్రమాణం. అధిక స్టార్ రేటింగ్ ఉన్న వస్తువు శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తక్కువ విద్యుత్‌ని వినియోగిస్తుంది.

LED బల్బులు, పాత రకాల బల్బుల కంటే చాలా ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. విద్యుత్ వినియోగంలో 75% వరకు ఆదా చేయవచ్చు. అంటే ఎల్‌ఈడీ బల్బులను ఉపయోగించడం వల్ల కరెంటు బిల్లులో చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్రిజ్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే అది తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది. అందువల్ల రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్ నుంచి 7 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి.

ఈ రోజుల్లో చాలామంది ఏసీలను వాడుతున్నారు. కానీ AC సరైన టెంపరేచర్‌ సెట్ చేయడం ముఖ్యం. మీరు AC టెంపరేచర్‌ చాలా తక్కువగా ఉంచినట్లయితే అది ఎక్కువ విద్యుత్ వినియోగిస్తుంది. అంత చల్లదనం మీ శరీరానికి హానిని కలిగిస్తుంది. ఏసీ టెంపరేచర్‌ 24 డిగ్రీల సెల్సియస్‌లో ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల విద్యుత్ వినియోగం తగ్గుతుంది. మానవ శరీరానికి మేలు జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories