Business Idea: పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువ.. సీజన్‌ ఏదైనా ఎల్లప్పుడు గిరాకీ..!

Business Idea Start Kadaknath Poultry Farm Earn More In Less Days
x

Business Idea:పెట్టుబడి తక్కువ లాభాలు ఎక్కువ.. సీజన్‌ ఏదైనా ఎల్లప్పుడు గిరాకీ..!

Highlights

Business Idea: భారతదేశంలో పౌల్ట్రీ ఫామ్ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. విశేషమేమిటంటే పౌల్ట్రీ ఫారమ్ వ్యాపారాన్ని గ్రామం, పల్లెలు, నగరం, మెట్రోలలో కూడా ప్రారంభించవచ్చు.

Business Idea: బిజినెస్‌ ఏదైనా అందరు మంచి లాభాలు రావాలని కోరుకుంటారు. కానీ ఇది అన్ని వ్యాపారాలలో జరగదు. కొన్ని సీజన్‌తో ముడిపడే బిజినెస్‌లు ఉంటే మరికొన్ని ఎల్లప్పుడు గిరాకీ ఉండే బిజినెస్‌లు కూడా ఉంటాయి. అయితే పౌల్ట్రీ ఫారమ్ వ్యాపారం అనేది ఎల్లప్పుడు గిరాకీ ఉండే బిజినెస్‌ ఎందుకంటే చికెన్‌కు ప్రతిచోటా డిమాండ్ ఉంటుంది. భారతదేశంలో పౌల్ట్రీ ఫామ్ వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. విశేషమేమిటంటే పౌల్ట్రీ ఫారమ్ వ్యాపారాన్ని గ్రామం, పల్లెలు, నగరం, మెట్రోలలో కూడా ప్రారంభించవచ్చు.

అయితే ఈరోజుల్లో డబ్బున్న వారు దేశీ కోడి మాంసం తినేందుకు ఇష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పౌల్ట్రీ ఫామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు కడక్‌నాథ్ కోళ్లని పెంచుతున్నారు. కడక్‌నాథ్ చికెన్ చాలా ఖరీదైనది. ఒక్క గుడ్డు ఖరీదు 50 రూపాయలకు పైగా పలుకుతోంది. దీని మాంసం కిలో రూ.1000కు విక్రయిస్తున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్‌ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో కడక్‌నాథ్ చికెన్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో కడక్‌నాథ్ కోళ్లని పెంచడం ద్వారా సాధారణ కోళ్ల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారం చేస్తున్నాడు. అతనికి రాంచీలో కడక్‌నాథ్ కోళ్ల ఫారం ఉంది. కడక్‌నాథ్ ప్రధానంగా మధ్యప్రదేశ్‌లో కనిపించే కోడి జాతి. కానీ ఇప్పుడు దేశంలోని చాలా ప్రాంతాల్లో లభిస్తున్నాయి. కడక్‌నాథ్ చికెన్ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. దీని రక్తం నల్లగా ఉంటుంది. విశేషమేమిటంటే దీని గుడ్లు కూడా నలుపు రంగులో ఉంటాయి. ఇందులో సాధారణ దేశీ చికెన్ కంటే చాలా రెట్లు ఎక్కువ ప్రొటీన్లు, విటమిన్లు లభిస్తాయి. అందుకే దీని డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.

మీరు కడక్‌నాథ్ కోళ్ల పెంపంకం చేయాలంటే ముందుగా 150 చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఒక షెడ్ వేయడం ద్వారా ఈ స్థలంలో దాదాపు 100 కడక్‌నాథ్ కోడిపిల్లలను పెంచవచ్చు. ఈ కోడిపిల్లలు 5 నెలల్లో పూర్తిగా అమ్మకానికి రెడీ అవుతాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కడక్‌నాథ్ కోడి మాంసం కిలో 800 నుంచి 1000 రూపాయలు పలుకుతోంది. ఒక్క గుడ్డు ఖరీదు 50 రూపాయల కంటే ఎక్కువ. కడక్‌నాథ్ చికెన్ వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల 5 నెలల తర్వాత వేల రూపాయలు సంపాదించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories