Jio offer: జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్..!

Jio offer: జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్..!
x

Jio offer: జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్..!

Highlights

అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌ను ఉపయోగించే 18–25 సంవత్సరాల వయస్సు గల (ప్రారంభ యాక్సెస్) జియో వినియోగదారులు, అక్టోబర్ 30 ‘25 నుండి ఉచితంగా గూగుల్ జెమిని ప్రోను పొందవచ్చు.

Jio offer: అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌ను ఉపయోగించే 18–25 సంవత్సరాల వయస్సు గల (ప్రారంభ యాక్సెస్) జియో వినియోగదారులు, అక్టోబర్ 30 ‘25 నుండి ఉచితంగా గూగుల్ జెమిని ప్రోను పొందవచ్చు. జెమిని ప్రో అపరిమిత చాట్‌లు, 2TB క్లౌడ్ స్టోరేజ్, వీఓ 3.1లో వీడియో జనరేషన్, నానో బనానాతో ఇమేజ్ జనరేషన్ తో పాటు మరిన్నింటిని అందిస్తుంది.

రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ , గూగుల్ ద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL), యువ సబ్‌స్క్రైబర్‌లకు గూగుల్ AI ప్రోను పూర్తిగా ఉచితంగా అందించడానికి ఒక మైలురాయి భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ దీపావళికి, జియో యువతతో ప్రారంభించి, 500 మిలియన్ల మంది భారతీయులకు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించడానికి జియో గొప్ప సాయం చేస్తోంది.

ఈ ప్రత్యేకమైన, పరిమిత-కాల ఆఫర్ జియో అత్యంత డైనమిక్ యూజర్ సెగ్మెంట్‌కు అపూర్వమైన విలువగా భావిస్తున్నారు. వారికి గూగుల్ ప్రీమియం AI సేవలకు 18 నెలల సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.

భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం : ఈ ఆఫర్ (ముందస్తు యాక్సెస్) ప్రత్యేకంగా జియో నెట్‌వర్క్‌లోని యూత్ సెగ్మెంట్ (25 సంవత్సరాల వరకు KyC వయస్సు) కోసం రూపొందించారు. ఇది దేశ భవిష్యత్ యువకులకు అధునాతన డిజిటల్ సాధనాలను యాక్సెస్ చేయగలదు.

5G-ఆధారిత AI: అర్హత ₹349 నుండి ప్రారంభమయ్యే 5G అన్‌లిమిటెడ్ ప్లాన్‌లకు (ప్రీపెయిడ్ , పోస్ట్‌పెయిడ్) ముడిపడి ఉంది, ఇది హై-స్పీడ్ 5G కనెక్టివిటీ శక్తిని జెమిని ప్రో అపారమైన సామర్థ్యాలతో అనుసంధానిస్తుంది.

అపూర్వమైన విలువ: యాక్టివేషన్ నుండి పూర్తి 18 నెలల వరకు అందుబాటులో ఉన్న ఈ ఆఫర్, యువ భారతీయులలో సృజనాత్మకత, విద్య ,ఆవిష్కరణలకు ఆజ్యం పోసేందుకు రూపొందించారు.

సరళమైన, సురక్షితమైన యాక్టివేషన్: వినియోగదారులు క్లెయిమ్ నౌ బ్యానర్‌పై క్లిక్ చేయడం ద్వారా MyJio యాప్ ద్వారా నేరుగా సేవను యాక్టివేట్ చేయవచ్చు.

జెమిని ఐ ప్రో గురించి

1. జెమిని యాప్: అత్యంత సమర్థవంతమైన మోడల్ 2.5 ప్రోకి అధిక యాక్సెస్.. అలాగే 2.5 ప్రోలో డీప్ రీసెర్చ్ , వీఓ 3 ఫాస్ట్‌కి పరిమిత యాక్సెస్‌తో వీడియో జనరేషన్‌ను అన్‌లాక్ చేయవచ్చు.

2. ఇమేజ్ జనరేషన్: నానో బనానాపై అధిక పరిమితులు

3. స్టోరేజ్: ఫోటోలు, డ్రైవ్, జిమెయిల్ కోసం 2 TB మొత్తం నిల్వ

4. ఫ్లో: సినిమాటిక్ దృశ్యాలు, కథనాలను సృష్టించడానికి AI ఫిల్మ్ మేకింగ్ సాధనంలో అధిక యాక్సెస్, వీఓ 3కి పరిమిత యాక్సెస్‌తో సహా

5. విస్క్: వీఓ 3తో ఇమేజ్-టు-వీడియో సృష్టికి అధిక యాక్సెస్

6. జెమిని కోడ్ అసిస్ట్ , జెమిని CLI: జెమిని CLI, జెమిని కోడ్ అసిస్ట్ IDE ఎక్స్‌టెన్షన్‌లలో అధిక రోజువారీ అభ్యర్థన పరిమితులు

7. నోట్‌బుక్‌ఎల్‌ఎం: 5x మరిన్ని ఆడియో , నోట్‌బుక్‌లు & మరిన్నింటితో పరిశోధన , రచనలో సాయం

8. జిమెయిల్, డాక్స్, విడ్‌లు , మరిన్నింటిలో జెమిని: గూగుల్ యాప్‌లలో జెమినిని నేరుగా యాక్సెస్ చేయవచ్చు.

వన్-టైమ్ యాక్టివేషన్, దీర్ఘకాలిక ప్రయోజనం: ఉచిత సేవను ఒకసారి మాత్రమే యాక్టివేట్ చేసుకుంటే చాలు. అయితే 18 నెలలు వినియోగదారుడు జియో క అపరిమిత 5G ప్లాన్‌లో యాక్టివ్‌గా ఉండాలి.

ప్రస్తుత కస్టమర్లకు ప్రయోజనాలు: చెల్లుబాటు అయ్యే Gmail IDని ఉపయోగించే ప్రస్తుత జెమిని ప్రో పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు వారి ప్రస్తుత పెయిడ్ ప్లాన్ చివరిలో ఉచిత 'Google AI Pro - పవర్డ్ బై జియో' ఆఫర్‌కు సజావుగా మారే అవకాశం ఇస్తారు.

ఈ ఆఫర్‌ను అక్టోబర్ 30, 2025 నుండి పొందవచ్చు. ఆఫర్‌ల గురించి మరింత సమాచారం కోసం, jio.comని సందర్శించవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories