PPF: ఈ ట్రిపుల్ 5 ఫార్ములా వాడి.. పీపీఎఫ్‌తో రూ.1.5 కోట్లు సంపాదించండి..!

PPF: ఈ ట్రిపుల్ 5 ఫార్ములా వాడి.. పీపీఎఫ్‌తో రూ.1.5 కోట్లు సంపాదించండి..!
x
Highlights

PPF: కేంద్ర ప్రభుత్వం జూలై-సెప్టెంబర్ 2025 త్రైమాసికానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును సంవత్సరానికి 7.1% వద్ద స్థిరంగా ఉంచింది.

PPF: కేంద్ర ప్రభుత్వం జూలై-సెప్టెంబర్ 2025 త్రైమాసికానికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేటును సంవత్సరానికి 7.1% వద్ద స్థిరంగా ఉంచింది. ఈ పథకం ముఖ్యంగా జీతం పొందే వారికి, సురక్షితమైన పెట్టుబడులు కోరుకునే వారికి చాలా ఆదరణ పొందింది. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు.. కానీ దీనిని 5 సంవత్సరాలకు పొడిగించుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఉద్యోగ కాలమంతా దీన్ని కొనసాగించవచ్చు.

ఒక వ్యక్తి 28 సంవత్సరాల వయస్సులో పీపీఎఫ్ ఖాతా తెరిచి, 58 సంవత్సరాల వయస్సు వరకు అంటే 30 సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగించినట్లయితే, అతను ఈ పథకాన్ని మూడు సార్లు పొడిగించుకోవచ్చు. ఈ కాలంలో ప్రతి సంవత్సరం రూ.1.5 లక్షల పెట్టుబడి పెడితే, మొత్తం పెట్టుబడి రూ.45 లక్షలు అవుతుంది. దీనిపై సంవత్సరానికి 7.1% వడ్డీ రేటుతో, 30 సంవత్సరాల తర్వాత మొత్తం రూ.1.54 కోట్లు అవుతుంది. ఇందులో వడ్డీ ద్వారా వచ్చే లాభం రూ.1.09 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది.

పీపీఎఫ్‌ను పొడిగించడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఎలాంటి అదనపు రిస్క్ లేకుండా మీ పదవీ విరమణ నాటికి బలమైన నిధిని సిద్ధం చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ మొత్తం, దానిపై వచ్చే వడ్డీ పూర్తిగా పన్ను రహితం. పదవీ విరమణ తర్వాత మీరు పెట్టుబడిని నిలిపివేసినప్పటికీ, పథకాన్ని మరో 5 సంవత్సరాలకు పొడిగించుకోవచ్చు. ఈ సమయంలో, ముగింపు బ్యాలెన్స్‌పై డ్డీ వస్తూనే ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి మీరు వడ్డీ మొత్తాన్ని పూర్తిగా తీసుకోవచ్చు.

ఉదాహరణకు, రూ.1.50 కోట్ల నిధిపై 7.1% వడ్డీతో, సంవత్సరానికి రూ.10.65 లక్షల వడ్డీ లభిస్తుంది. దీనిని 12 నెలలకు విభజిస్తే, నెలకు సుమారు రూ.88,750ల స్థిరమైన, పన్ను రహిత ఆదాయం అవుతుంది. పీపీఎఫ్ అనేది దీర్ఘకాలిక సురక్షిత పెట్టుబడి పథకం మాత్రమే కాదు, ఇది పదవీ విరమణకు ఫినాన్షియల్ బ్యాకప్ గా కూడా మారుతుంది. సరైన సమయంలో పెట్టుబడిని ప్రారంభించి, పొడిగింపు ప్రయోజనాన్ని పొందితే ఈ పథకం మిమ్మల్ని రిస్క్ లేకుండా కోటీశ్వరులను చేయగలదు. అందుకే, ఆర్థిక నిపుణులు కూడా ప్రతి ఉద్యోగి పోర్ట్‌ఫోలియోలో దీనిని చేర్చుకోవాలని సలహా ఇస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories