Budget 2025: నేడే కేంద్ర బడ్జెట్.. రికార్డ్ బ్రేక్ చేయనున్న నిర్మలమ్మ

Budget 2025: నేడే కేంద్ర బడ్జెట్.. రికార్డ్ బ్రేక్ చేయనున్న నిర్మలమ్మ
x
Highlights

Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025-26ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్ ను పార్లమెంట్లో...

Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025-26ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం ఇది 8వ సారి కావడం విశేషం. కాగా కేంద్ర బడ్జెట్ పై సామాన్యులు మధ్య తరగతి ప్రజలు అనేక ఆశలు పెట్టుకున్నారు. ఈసారైనా ఆదాయపన్నుపై భారీ ఊరట కలిగిస్తారేమోనని వేతన జీవులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

వార్షికంగా రూ 15లక్షల వరకు సంపాదిస్తున్నవారు తమకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుందని ఆశిస్తున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 75,000 నుంచి రూ. 1లక్షకు పెంచడంతో కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అదనంగా సెక్షన్ 87ఏ కింద రాయితీని రూ. 10లక్షలకు పెంచవచ్చని తెలుస్తోంది.

ఈ పార్లెమంట్ సమావేశాల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 8 బడ్జెట్లు సమర్పించి తన రికార్డును తానే బద్దలు కొట్టనున్నారు. గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 1959-64, 1976-69 మధ్య కాలంలో పది బడ్జెట్లతో అత్యధిక బడ్జెట్ ను సమర్పించి రికార్డును కలిగి ఉన్నారు. ఇతర ప్రముక ఆర్థిక మంత్రులతో 9బడ్జెట్లతో పి. చిదంబరం, 8 బడ్జెట్లతో ప్రణబ్ ముఖర్జీ వరుసలో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories