Top 5 silver-producing countries: ప్రపంచంలోని వెండి నిల్వలున్న టాప్‌–5 దేశాలు.. భారత్‌ స్థానం ఏది?

Top 5 silver-producing countries
x

Top 5 silver-producing countries: ప్రపంచంలోని వెండి నిల్వలున్న టాప్‌–5 దేశాలు.. భారత్‌ స్థానం ఏది?

Highlights

Top 5 silver-producing countries: 2025లో బంగారం ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులపై భారమయ్యాయి. అయితే అదే సమయంలో వెండి ధరలు ఊహించని స్థాయిలో దూసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాయి.

Top 5 silver-producing countries: 2025లో బంగారం ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులపై భారమయ్యాయి. అయితే అదే సమయంలో వెండి ధరలు ఊహించని స్థాయిలో దూసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచాయి. వెండి ధరలు రికార్డు స్థాయిని తాకుతూ పెట్టుబడిదారులకు మంచి లాభాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర సుమారు రూ.2,19,000గా ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో అత్యధిక వెండి నిల్వలు ఉన్న దేశాలు ఏవో, ఈ జాబితాలో భారతదేశం స్థానం ఏమిటో తెలుసుకుందాం.

పెరూ – వెండి రాజ్యం

ప్రపంచంలోనే అత్యధిక వెండి నిల్వలు కలిగిన దేశంగా పెరూ తొలి స్థానంలో ఉంది. ఈ దేశంలో సుమారు 1,40,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలు ఉన్నాయి. హువారీ ప్రాంతంలో ఉన్న ‘అంటామినా’ గని ప్రపంచంలోనే అతిపెద్ద వెండి గనిగా గుర్తింపు పొందింది. ఈ గని కారణంగానే పెరూను వెండి రాజుగా పిలుస్తారు.

రష్యా – రెండో స్థానం

వెండి నిల్వల విషయంలో రష్యా రెండో స్థానంలో ఉంది. రష్యాలో దాదాపు 92,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలు ఉన్నాయి. సైబీరియా, యురల్స్ ప్రాంతాల్లో ఉన్న గనుల నుంచి భారీ స్థాయిలో వెండి ఉత్పత్తి జరుగుతోంది. రాజకీయ, ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, రష్యా ప్రపంచ వెండి మార్కెట్‌కు కీలకంగా నిలుస్తోంది.

చైనా – మూడో స్థానంలో

చైనా వెండి ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉంది. ఈ దేశంలో సుమారు 70,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలు ఉన్నట్లు అంచనా. హెనాన్ ప్రావిన్స్‌లోని యింగ్ గని చైనాలో ప్రధాన వెండి గనిగా ఉంది. బంగారం, వెండి, జింక్ వంటి ఖనిజాల ఉత్పత్తిలో చైనా దూకుడుగా ముందుకు సాగుతూ తన ఆర్థిక బలాన్ని పెంచుకుంటోంది.

పోలాండ్ – నాలుగో స్థానం

పోలాండ్ వెండి నిల్వల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ దేశంలో దాదాపు 61,000 మెట్రిక్ టన్నుల వెండి ఉత్పత్తి అవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థ KGHM పోలాండ్‌లో అతిపెద్ద వెండి, రాగి ఉత్పత్తిదారుగా ఉంది. 2024లో గ్లోగోవ్ కాపర్ స్మెల్టర్‌లో వెండిని శుద్ధి చేశారు.

మెక్సికో – ఐదో స్థానం

వెండి ఉత్పత్తిలో మెక్సికో ఐదో స్థానంలో ఉంది. ఈ దేశంలో సుమారు 37,000 మెట్రిక్ టన్నుల వెండి నిల్వలు ఉన్నాయి. జకాటెకాస్ ప్రాంతంలోని న్యూమాంట్ వై పెనాస్క్విటో గని మెక్సికోలో రెండో అతిపెద్ద గనిగా, ప్రపంచంలో ఐదో అతిపెద్ద వెండి గనిగా గుర్తింపు పొందింది.

భారతదేశం స్థానం ఏది?

వెండి నిల్వల విషయంలో భారతదేశం టాప్–5 జాబితాలో లేదు. దేశంలో వెండి నిల్వలు పరిమితంగా ఉన్నాయి. అయితే భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద వెండి వినియోగదారుల్లో ఒకటిగా ఉంది. భారీగా వెండిని దిగుమతి చేసుకుంటూ, శుద్ధి చేసిన వెండిని కొంత మేర ఎగుమతి కూడా చేస్తోంది. ఈ విధంగా ప్రపంచ వెండి మార్కెట్‌లో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories