Fixed Deposits: అధిక వడ్డీ చెల్లించే 10 ఫైనాన్స్‌ కంపెనీలు మీకు తెలుసా

Best Finance Companies are Paying 7 to 48 Interest on Fixed Deposits | Deposits Interests Rates 2021
x

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లించే 10 ఫైనాన్స్‌ కంపెనీలు మీకు తెలుసా..?

Highlights

Fixed Deposits Interest Rates 2021: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లించే 10 ఫైనాన్స్‌ కంపెనీలు మీకు తెలుసా..?

Fixed Deposits Interests Rates 2021: ఈ రోజులలో ఎప్పుడు ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అది ఆర్థిక అవసరాలే కావొచ్చు లేదంటే కరోనా లాంటి వ్యాధులే కావొచ్చు. గత ఏడాది కాలంగా కరోనా వల్ల చాలామంది ఎంతో నష్టపోయారు. వలసజీవులు, కూలీలు, సామాన్యులకు తినడానికి తిండికూడా దొరకని పరిస్థితి నెలకొంది. అటువంటి పరిస్థితులలో చాలామంది డబ్బులు పొదుపు చేయడం గురించి ఆలోచిస్తున్నారు. అందుకోసం అధిక వడ్డీ చెల్లించే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లాంటి పెట్టుబడులవైపు మొగ్గు చూపుతున్నారు. అయితే బ్యాంకుల కంటే కార్పరేట్‌ ఫైనాన్స్ కంపెనీలు ఎఫ్డీలపై ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నాయి. అలాంటి పది కంపెనీల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

ఇందులో శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ 12-60 నెలల FDపై 7.48 శాతం రాబడిని ఇస్తూ మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ కంపెనీ 12-60 నెలల FDపై 7.48 శాతం రాబడిని ఇస్తోంది. మూడో స్థానంలో బజాజ్‌ ఫైనాన్స్‌ 12-60 నెలల FDపై 6.80 శాతం వడ్డీని అందిస్తోంది. దీని తర్వాత PNB హౌసింగ్ ఫైనాన్స్ 12-120 నెలల కాల వ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.70 శాతం వడ్డీని అందిస్తోంది. HDFC కూడా FD పథకాన్ని అమలు చేస్తుంది.

HDFC 33-99 నెలల కాలవ్యవధికి FDలపై 6.70 శాతం వడ్డీని అందిస్తోంది. దీని తర్వాత ICICI హోమ్ ఫైనాన్స్ 12-120 నెలల FD పథకంపై 6.65 శాతం వడ్డీని ఇస్తుంది. మహీంద్రా ఫైనాన్స్ 12-60 నెలల FDలపై 6.45 శాతం రాబడిని అందిస్తోంది. సుందరం హోమ్ ఫైనాన్స్ 12-60 నెలల FDలపై 5.80 శాతం వడ్డీని అందిస్తోంది. అదేవిధంగా సుందరం ఫైనాన్స్ 12-36 నెలల FDలపై 5.80 శాతం వడ్డీని ఇస్తోంది. చివరగా LIC హౌసింగ్ ఫైనాన్స్ 12-60 నెలల FD పై 5.75 శాతం వడ్డీని చెల్లిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories