Credit Card: జూలై 1 నుంచి కొత్త మార్పు.. ఏడు రోజుల్లోగా ఈ పనిచేయకుంటే రూ.500 జరిమానా..!

Banks Will Have to pay a Fine of Rs 500 per day if they do not do this Within Seven Days in case of Credit Card Closure
x

Credit Card: జూలై 1 నుంచి కొత్త మార్పు.. ఏడు రోజుల్లోగా ఈ పనిచేయకుంటే రూ.500 జరిమానా..!

Highlights

Credit Card: నేటి కాలంలో క్రెడిట్‌ కార్డులని చాలామంది వాడుతున్నారు. బ్యాంకులు వీటిని ఎక్కువగా జారీచేస్తున్నాయి.

Credit Card: నేటి కాలంలో క్రెడిట్‌ కార్డులని చాలామంది వాడుతున్నారు. బ్యాంకులు వీటిని ఎక్కువగా జారీచేస్తున్నాయి. వీటి ద్వారా నగదు రహిత లావదేవీలు సులువుగా చేయవచ్చు. అలాగే క్రెడిట్‌ కార్డుతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అదే విధంగా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. అయితే జూలై 1, 2022 నుంచి క్రెడిట్‌ కార్డుకి సంబంధించిన కొన్ని నియమాలు మారబోతున్నాయి. ఇది ప్రజలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

జూలై 1 నుంచి మార్పు

ఈ క్రెడిట్ కార్డ్ నియమాలు జూలై 1, 2022 నుంచి అమలులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నోటిఫికేషన్‌లో ప్రకటించింది. క్రెడిట్ కార్డ్ బిల్లులో ఏదైనా తప్పుగా ఉంటే వినియోగదారుడు బ్యాంకుకి ఫిర్యాదు చేయవచ్చు. ఇలాంటి సమయంలో బ్యాంకు కార్డ్ హోల్డర్ ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలి. బిల్లులు, స్టేట్‌మెంట్‌లను పంపడం, ఈ మెయిల్ చేయడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. అంతేకాకుండా కార్డుదారులకు తగినంత సమయం ఇవ్వాలి. అప్పుడే వారు వడ్డీ లేకుండా చెల్లింపులు చేసే అవకాశాలు ఉంటాయి.

క్రెడిట్ కార్డ్ హోల్డర్ క్రెడిట్ కార్డ్ మూసివేత కోసం దరఖాస్తు చేస్తే RBIప్రకారం ఏడు రోజులలో కార్డును మూసివేయవలసి ఉంటుంది. ఒక వేళ బ్యాంకులు ఏదైనా జాప్యం చేస్తే కంపెనీకి రోజుకు రూ. 500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. క్రెడిట్‌ కార్డు క్లోజ్‌ అయిన తర్వాత కార్డ్ హోల్డర్ వెంటనే ఈ మెయిల్, SMS మొదలైన వాటి ద్వారా కార్డు మూసివేసిన సంగతి తెలియజేయాలి. అలాగే బ్యాంకులు ఇష్టారీతిన క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయకూడదు. ఏదైనా సరే ఆర్బీఐ నిబంధనల మేరకు నడుచుకోవాలి. ముఖ్యంగా కస్టమర్ అనుమతి లేకుండా కంపెనీ క్రెడిట్ కార్డ్‌ని జారీ చేయకూడదు. ఒకవేళ కస్టమర్ అనుమతి లేకుండా క్రెడిట్ కార్డు జారీ చేసి బిల్లు చేస్తే కంపెనీ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories