బ్యాంకుల కొత్త పోకడ.. క్రెడిట్‌ కార్డు లిమిట్‌ల్లో కోతలు

బ్యాంకుల కొత్త పోకడ.. క్రెడిట్‌ కార్డు లిమిట్‌ల్లో కోతలు
x
Representational Image
Highlights

లాక్‌డౌన్‌ ప్రభావంతో కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఖాతాదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.

లాక్‌డౌన్‌ ప్రభావంతో కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఖాతాదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. చిరు వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరి వద్ద క్రెడిట్‌ కార్డులు ఉన్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా అంతా ఇళ్లలోనే ఉంటున్నారు. వీరు కార్డుల్లో డబ్బులు వినియోగించుకున్న తర్వాత తిరిగి చెల్లిస్తారా? లేదా అనే సందేహాలతో ప్రైవేటు బ్యాంకులు ఈ మేరకు కోతలు పెడుతున్నట్లు తెలుస్తోంది

దీంతో వారి ఆర్థిక పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చి బ్యాంకులు క్రెడిట్‌ కార్డుల్లో కోతలు విధించేందుకు రంగం సిద్ధం చేశాయి. క్రెడిట్‌ కార్డుల్లో లిమిట్‌ను ఒక్కసారిగా తగ్గించేశాయి. ముందస్తు చర్యల్లో భాగంగా బ్యాంకులు కార్డులో అప్పులు తగ్గించుకునేందుకు కొత్త పద్ధతిని అనుసరిస్తున్నాయని నిపుణులు అంటోన్నారు. ఇప్పటికే ఎంతోమంది బిల్లులు చెల్లించడం లేదని బ్యాంకులు ఆందోళనలో ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ లో క్రెడిట్‌ కార్డులు వినియోగదారులు సుమారుగా 40 లక్షల వరకు ఉంటారని ఓ బ్యాంకు అధికారి తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories