Bank Holidays:ఏప్రిల్ 1 నుంచి 5 వరకు ఈ నగరాల్లో బ్యాంకులు పనిచేయవు..!

Banks in these Cities will be Closed from April 1 to 5
x

Bank Holidays:ఏప్రిల్ 1 నుంచి 5 వరకు ఈ నగరాల్లో బ్యాంకులు పనిచేయవు..!

Highlights

Bank Holidays:ఏప్రిల్ 1 నుంచి 5 వరకు ఈ నగరాల్లో బ్యాంకులు పనిచేయవు..!

Bank Holidays: రేపటి నుంచి కొత్త నెల ప్రారంభం కానుంది. కాబట్టి బ్యాంకులో ఏదైనా పని ఉంటే ఈ రోజే ముగించండి. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరంలో వరుసగా 5 రోజులు బ్యాంకులకి సెలవులు వస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి 5 వరకు వివిధ నగరాల్లోని బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్ నెల ప్రారంభంలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే ముందుగానే సెలవుల జాబితాను తనిఖీ చేసుకుంటే మంచిది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితాను జారీ చేస్తుంది. ఇందులో రాష్ట్రాన్ని బట్టి వేర్వేరు రోజులలో సెలవులు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరం ప్రారంభంలోనే 12 నెలల సెలవుల జాబితాను ప్రకటిస్తుంది. దీని వల్ల ఉద్యోగులు, కస్టమర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

ఏప్రిల్ 1 - బ్యాంక్ ఖాతాల వార్షిక ముగింపు - దాదాపు అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేస్తారు.

ఏప్రిల్ 2 – గుడి పడ్వా/ ఉగాది పండుగ/ నవరాత్రి మొదటి రోజు/ తెలుగు నూతన సంవత్సరం/ సాజిబు నొంగంపంబ (చైరోబా) కారణంగా బేలాపూర్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇంఫాల్, జమ్మూ, ముంబై, నాగ్‌పూర్, పనాజీ, శ్రీనగర్‌లలో బ్యాంకులు మూసివేస్తారు.

ఏప్రిల్ 3 – ఆదివారం కారణంగా బ్యాంకులు మూసివేస్తారు.

ఏప్రిల్ 4 –సరిహుల్ కారణంగా రాంచీలో బ్యాంకులు మూసివేస్తారు.

ఏప్రిల్ 5 – బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు కారణంగా హైదరాబాద్‌లో బ్యాంకులు పనిచేయవు.

నెల మొత్తం గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్‌లో మొత్తం 15 రోజులు బ్యాంకులకి సెలవులు వస్తున్నాయి. ఇందులో శనివారం, ఆదివారం సెలవులు కూడా ఉన్నాయి. వివిధ రాష్ట్రాల రాష్ట్రాల పండుగలు కూడా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories