Bank Holidays: బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపటి నుంచి వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్‌..!

Banks Closed for 3 Days Continuous From Tomorrow Onwards Know the Dates and Affected Regions
x

Bank Holidays: బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌.. రేపటి నుంచి వరుసగా 3 రోజులు బ్యాంకులు బంద్‌..!

Highlights

Bank Remain Closed For 3 days: బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌ రేపు అంటే మార్చి 13, 14, 15 తేదీల్లో వరుసగా అన్నీ ప్రభుత్వం, ప్రైవేటు రంగ బ్యాంకులకు సెలవు ఉండనుంది.

Bank Remain Closed For 3 Days: బ్యాంకు ఖాతాదారులకు బిగ్‌ అలెర్ట్‌ రేపు అంటే మార్చి 13, 14, 15 తేదీల్లో వరుసగా అన్నీ ప్రభుత్వం, ప్రైవేటు రంగ బ్యాంకులకు సెలవు ఉండనుంది. ఈ నేపథ్యంలో ఏవైనా బ్యాంకు పనులు ఉంటే ముందుగానే పూర్తి చేసుకోండి. తద్వారా ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా ఉంటారు.

ప్రధానంగా బ్యాంకులకు ఆర్‌బీఐ సెలవుల క్యాలెండర్‌ విడుదల చేస్తుంది. దాని ప్రకారం బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఇవి కాకుండా ఆయా రాష్ట్రాల స్థానిక పండుగల ప్రకారం కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే, రేపటి నుంచి వరుసగా మూడు రోజులు బ్యాంకులు బంద్‌ ఉంటాయి. హోలీ మన దేశంలో ప్రత్యేకమైన పండుగ. వివిధ రాష్ట్రాల్లో ఎంతో గ్రాండ్‌గా ఈ వేడుకలు జరుపుకొంటారు. మార్చి 13న హోలికా దహనం సందర్భంగా ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, కేరళ, ఉత్తరప్రదేశ్‌లలో ఈరోజు బ్యాంకులు బంద్‌ ఉంటాయి.

మార్చి 14 శుక్రవారం హోలీ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులు బంద్‌ ఉండనున్నాయి. కానీ, నాగాలాండ్‌, ఒడిశా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.

మార్చి 15 శనివారం కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు హోలీ పండుగ జరుపుకోనున్నారు. ముఖ్యంగా ఒడిశా, మణిపూర్‌, బిహార్‌, త్రిపురలలో బ్యాంకులు బంద్‌ ఉంటాయి. అయితే, ఈ ప్రాంతాల్లో ఇది ఆప్షనల్‌ హాలిడే మాత్రమే.

అయితే, బ్యాంకులు బంద్‌ ఉన్నా ఖాతాదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. మొబైల్‌, నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం సేవలు యథావిధిగా పనిచేస్తాయి. ఇవి కాకుండా ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌, బిల్లు చెల్లింపులు కూడా ఆన్‌లైన్‌లో చేయవచ్చు. అయితే ఎక్కువ మొత్తంలో నగదు విత్‌డ్రా చేసుకోవాలన్నా.. డిపాజిట్‌ చేయాలన్నా కూడా బ్యాంకుకు తప్పకుండా వెళ్లాల్సిందే.

మార్చి నెలలో బ్యాంకు సెలవులు జాబితా..

మార్చి 16 (ఆదివారం)- దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులు బంద్ ఉంటాయి.

మార్చి 22 (నాలుగో శనివారం)- ఈరోజు కూడా బ్యాంకులు బంద్‌. ఈరోజు 'బిహార్‌ డే' కూడా. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలో అన్నీ బ్యాంకులు బంద్ ఉంటాయి.

మార్చి 23 (ఆదివారం)- అన్నీ బ్యాంకులు బంద్‌ ఉంటాయి.

మార్చి 27 - షబ్‌ ఎ ఖదర్ల సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లో బ్యాంకులు బంద్‌ ఉంటాయి.

మార్చి 30 (ఆదివారం)- దేశంలో ఉన్న అన్నీ బ్యాంకులు బంద్‌ ఉంటాయి.

ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ కూడా.

మార్చి 31 (సోమవారం)- ఈద్‌ ఉల్‌ ఫితర్‌ సందర్భంగా మిజోరం, హిమాచల్‌ ప్రదేశ్‌లలో తప్ప మిగతా అన్నీ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్‌ ఉండనున్నాయి.‌

Show Full Article
Print Article
Next Story
More Stories