Banks Bandh: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..రేపటి నుంచి 4 రోజులు బంద్

bank employees Strike
x

బ్యాంకుల మూత

Highlights

Banks Bandh: రేపటి నుంచి వరుసగా నాలుగు రోజులు బ్యాంకు మూతపడనున్నాయి.

Banks Branches Closed: మీకు బ్యాంకు ఖాతా ఉందా? పనుల నిమిత్తం బ్యాంకులకి వెళ్లాలని అనుకుంటుంన్నారా? అయితే ఈ రోజే మీ బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లండి..లేదంటే నాలుగు రోజులపాటు ఎదురుచూడక తప్పదు. ఎందుకంటే రేపటి నుంచి వరుసగా నాలుగు రోజులు బ్యాంకు మూతపడనున్నాయి. రేపు రెండో శనివారం బ్యాంకులకు సెలవు. ఆ తరువాత 14వ తేదీ ఆదివారం ఎలాగూ బ్యాంకులు తెరుచుకోవు. అయితే సోమ, మంగళవారాల్లో కూడా బ్యాంకులు మూతపడబోతున్నాయి.

ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం, మంగళవారం బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు బ్యాంకులు తేరుచుకోవు. ఆదివారం లోగా యూనియన్లు సమ్మె ప్రతిపాదనను ఉపసంహరించుకోని పక్షంలో బ్యాంక్‌లు వరుసగా నాలుగు రోజులపాటు మూసి ఉండనున్నాయి. బ్యాంకులు 4 రోజులు మూతపడతాయి కాబట్టి ఏటీఎంలలో నగదు నిల్వలు ఉండకపోవచ్చు. నగదు విత్ డ్రా చేసుకోవాలనుకునే వారు ఈ రోజు చేసుకొండి.

అయితే, బ్యాంకులు నాలుగు రోజులు మూతపడినా.. ఖాతాదారులకు ఊరట కలిగించే అంశం ఏంటంటే.. బ్యాంకులు మూతపడినప్పటికి ఈ 4 రోజులు మొబైల్ బ్యాంకింగ్ సేవలు, ఇంటర్నెట్ బ్యాకింగ్ సేవలకు యాథావిధిగా కోనసాగుతాయి. బ్యాంకులు మూతపడనుండటంతో ఖాతాదారులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories