ICICI : షాకిచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్.. సేవింగ్స్ అకౌంట్‌కు మినిమం బ్యాలెన్స్ రూ.50 వేలు!

ICICI : షాకిచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్.. సేవింగ్స్ అకౌంట్‌కు మినిమం బ్యాలెన్స్ రూ.50 వేలు!
x

ICICI : షాకిచ్చిన ఐసీఐసీఐ బ్యాంక్.. సేవింగ్స్ అకౌంట్‌కు మినిమం బ్యాలెన్స్ రూ.50 వేలు!

Highlights

దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ సామాన్యులకు మరో షాక్ ఇచ్చింది. సేవింగ్స్ అకౌంట్‌లో కనీస బ్యాలెన్స్‌ను భారీగా పెంచింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఇంతకుముందు రూ.10,000 ఉన్న ఈ లిమిట్‌ను ఇప్పుడు ఏకంగా రూ.50,000కు పెంచింది.

ICICI : దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్ సామాన్యులకు మరో షాక్ ఇచ్చింది. సేవింగ్స్ అకౌంట్‌లో కనీస బ్యాలెన్స్‌ను భారీగా పెంచింది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఇంతకుముందు రూ.10,000 ఉన్న ఈ లిమిట్‌ను ఇప్పుడు ఏకంగా రూ.50,000కు పెంచింది. ఆగస్ట్ 1, 2025 నుంచి కొత్తగా తెరిచిన అకౌంట్స్‌కు ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. దేశంలో ఇంత ఎక్కువ కనీస బ్యాలెన్స్ నిబంధన విధించిన తొలి బ్యాంక్ ఇదే. ఐసీఐసీఐ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నిర్ణయం ద్వారా బ్యాంక్ సామాన్య ఖాతాదారుల నుంచి దూరం జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఐసీఐసీఐ బ్యాంక్ మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో కనీస బ్యాలెన్స్‌ను రూ.10,000 నుంచి రూ.50,000కు పెంచింది. అదే విధంగా, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ.5,000 నుంచి రూ.25,000కు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 నుంచి రూ.10,000కు పెంచింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) 2020లోనే కనీస బ్యాలెన్స్ నిబంధనను పూర్తిగా తొలగించింది. ఇతర బ్యాంకులలో ఈ లిమిట్ సాధారణంగా రూ.2,000 నుంచి రూ.10,000 మధ్య ఉంటుంది. ఉదాహరణకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో రూ.10,000, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రూ.5,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,500 కనీస బ్యాలెన్స్ నిబంధనను అమలు చేస్తోంది.

ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు రిచ్ కస్టమర్లపై దృష్టి సారిస్తోంది. ఇలాంటి అధిక కనీస బ్యాలెన్స్ నిబంధనల ద్వారా ఎక్కువ సంపన్నులను ఆకర్షించవచ్చని బ్యాంక్ భావిస్తోంది. తక్కువ బ్యాలెన్స్ ఉన్న కస్టమర్లతో పోలిస్తే, సంపన్న కస్టమర్లకు బీమా, బ్రోకరేజ్ వంటి ఇతర ఆర్థిక ఉత్పత్తులను అమ్మి ఎక్కువ లాభాలు పొందవచ్చని బ్యాంక్ అంచనా వేస్తోంది. ఈ విషయంపై ఐసీఐసీఐ బ్యాంక్ అధికారికంగా స్పందించలేదు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం.. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన అకౌంట్స్‌కు కనీస బ్యాలెన్స్ అవసరం లేదు. అయితే, ఇతర అకౌంట్‌లకు సంబంధించి బ్యాంకులు తమ పాలసీల ప్రకారం ఛార్జీలు విధించుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories