Bank Of Baroda: ఈ బ్యాంకులో 400 రోజుల ఎఫ్‌డీ స్కీమ్‌పై కళ్లు చెదిరే వడ్డీ పొందుతారు

Bank Of Baroda
x

Bank Of Baroda: ఈ బ్యాంకులో 400 రోజుల ఎఫ్‌డీ స్కీమ్‌పై కళ్లు చెదిరే వడ్డీ పొందుతారు

Highlights

Bank Of Baroda 400 Days FD: బ్యాంకులో ఎక్కువ వడ్డీ అందించే పథకాల్లో డబ్బులు పెట్టుబడి పెడతారు ఖాతాదారులు.

Bank Of Baroda 400 Days FD: కస్టమర్లు ఎక్కువ వడ్డీ అందించే స్కీమ్‌లలో పెట్టుబడులు పెడతారు. ఈ నేపథ్యంలో వాళ్లు ఫిక్సెడ్‌ డిపాజిట్‌కు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. బ్యాంకుల్లో అయితే తమ డబ్బులు భద్రంగా ఉంటాయని నమ్ముతారు. అయితే, అన్నీ బ్యాంకులు సేవింగ్స్‌, రికరింగ్‌, ఫిక్సెడ్‌ డిపాజిట్‌ ఖాతాలను నిర్వహిస్తాయి. ఇందులో కస్టమర్లకు ఆకర్షణీయమైన వడ్డీ ఒక నిర్ణీత గడువుకు చెల్లిస్తాయి.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు వివిధ సేవింగ్స్‌ పథకాలను పరిచయం చేస్తోంది. అయితే, ఎక్కువ వడ్డీ కూడా అందిస్తోంది. ఈ బ్యాంకులో మీరు రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే రూ.17,668 రిటర్న్‌ పొందుతారు. ఈ ఆకర్షణీయమైన స్కీమ్‌ అందిస్తోంది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 400 రోజుల ఫిక్సెడ్‌ డిపాజిట్‌ ప్లాన్‌పై ఈ రూ.7.90 వడ్డీ వరకు అందిస్తోంది. సాధారణంగా ఈ బ్యాంకు రూ.7.3 వడ్డీ ఇస్తోంది. ఇందులో రూ.7.80 వడ్డీ సీనియర్‌ సిటిజెన్లకు అందిస్తోంది. ఇది కాకుండా రూ.7.90 సూపర్‌ సీనియర్‌ సిటిజెన్స్‌కు అంటే 80 ఏళ్లు పైబడిన వారికి అందిస్తోంది.

అంటే ఈ పథకంలో మీరు రూ.2 లక్షలు 400 రోజులు సాధారణంగా డిపాజిట్‌ చేస్తే మీరు రూ.2,16,268 రిటర్న్‌ వస్తుంది. ఇక సూపర్‌ సీనియర్‌ సిటిజెన్స్‌ రూ.2,17,902 పొందుతారు. అంటే మెచ్యూరిటీ సమయానికి రూ.17,902 పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories