Bank Holidays: బ్యాంకులు ఈ వారంలో 2 రోజులు బంద్ ఉంటాయా? ఎందుకో తెలుసా?

Bank Holidays Will Banks Be Closed for 2 Days This Week What You Need to Know
x

Bank Holidays: బ్యాంకులు ఈ వారంలో 2 రోజులు బంద్ ఉంటాయా? ఎందుకో తెలుసా?

Highlights

2 Days Bank Holidays: బ్యాంకు ఉద్యోగులకు కేవలం 5 రోజులు మాత్రమే పనిదినాలు అమలు చేయాలని ఎన్నో రోజులుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

2 Days Bank Holidays: ఈ వారంలో బ్యాంకులు కేవలం 2 రోజులు మాత్రమే పనిచేస్తాయా? అనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాతనే బ్యాంకులో రెండు రోజులు సెలవులు ఉంటాయి. అంటే వారంలో ఐదు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి.

బ్యాంకు ఉద్యోగులు ఎన్నో రోజులుగా ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని కోరుతున్నారు. ఇండియా కూడా దీనిపై మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేస్తే బ్యాంకు ఉద్యోగులకు ప్రతి శనివారం, ఆదివారం కూడా సెలవు వస్తుంది. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇంతకుముందు రెండు రోజులు బ్యాంకు సమ్మె చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో సమ్మె విరమించుకుంది.

ఐదు రోజుల దినాలు అమలులోకి వస్తే ప్రభుత్వ, ప్రైవేటు రెండు రంగాల బ్యాంకులు కేవలం ఐదు రోజులు మాత్రమే పని చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సలహా తీసుకుంటుంది. ఆ తర్వాత అమలు చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం బ్యాంకులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. అయితే బ్యాంకు ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాలు అమలుకు వస్తే ఉదయం 9:45 నిమిషాల నుంచి సాయంత్రం 5:30 వరకు పని చేయాల్సి ఉంటుంది. అంటే ప్రతిరోజు వాళ్లు పని చేసే 7 గంటల నుంచి మరో 45 నిమిషాలు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది.

అంటే ఐదు రోజుల పని దినాలు అమలులోకి వస్తే ఉద్యోగుల పని సమయంలో మార్పులు చోటు చేసుకుంటాయి. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ పై ప్రభావం పడుతుంది. అయితే కొద్ది రోజులుగా ఈ బ్యాంకు ఉద్యోగులు సంఘాలు 10 ఏళ్లుగా శనివారం, ఆదివారం సెలవు దినాలు ప్రకటించాలని కోరుతున్నాయి. ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతి రెండో, నాలుగో శనివారాలు కూడా సెలవులు ఇస్తున్నాయి. అయితే, ఈ సారి కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ ఈ 5 రోజుల పనిదినాలపై సానుకూలంగా స్పందిస్తాయని బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఎదురుచూస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories