Bank Holidays in November: బ్యాంకులకు నవంబర్‌లో భారీగా సెలవులు.. ఎన్ని రోజులంటే?

Bank Holidays in November 2023 Issued by RBI 15 Days Check Here the List of Holidays in Banks State-Wise
x

Bank Holiday in November: బ్యాంకులకు నవంబర్‌లో భారీగా సెలవులు.. ఎన్ని రోజులంటే?

Highlights

Bank Holidays in November: నవంబర్ నెల నేటి నుంచి ప్రారంభం కానుంది. భారతదేశంలో పండుగ సీజన్ కొనసాగుతుంది.

Bank Holidays in November: నవంబర్ నెల నేటి నుంచి ప్రారంభం కానుంది. భారతదేశంలో పండుగ సీజన్ కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులకు కూడా సెలవులు భారీగానే ఉన్నాయి. కొత్త నెల ప్రారంభానికి ముందే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేసింది. మీరు కూడా నవంబర్‌లో బ్యాంకులకు సంబంధించిన ముఖ్యమైన పనులను పూర్తి చేయాలనుకుంటే, ఖచ్చితంగా ఇక్కడ సెలవుల జాబితాను తనిఖీ చేసుకోవాల్సిందే.

నవంబర్‌లో దాదాపుగా 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. ఇందులో దీపావళి, గోవర్ధన్ పూజ, ఛత్ పూజ మొదలైన పండుగ సెలవులు ఉన్నాయి. దీంతో పాటు శని, ఆదివారాలు సెలవులను కూడా ఇందులో చేర్చారు. ఆర్‌బీఐ విడుదల చేసిన సెలవుల జాబితాలోని చాలా సెలవులు జాతీయ స్థాయిలో ఉన్నాయి. నవంబర్ నెలలో బ్యాంకుల సెలవులను ఓసారి చూద్దాం..

నవంబర్ నెలలో వారాంతపు సెలవులు..

నవంబర్ 5 ఆదివారం సెలవు

నవంబర్ 11 రెండవ శనివారం సెలవు

నవంబర్ 12 ఆదివారం సెలవు

నవంబర్ 19 ఆదివారం సెలవు

నవంబర్ 25 నాలుగవ శనివారం సెలవు

నవంబర్ 26 ఆదివారం సెలవు

ఇక నవంబర్ నెలలో సాధారణ, పండుగ సెలవులు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

నవంబర్ 1ర బెంగళూరు, ఇంఫాల్, సిమ్లాలో కర్వా చౌత్, కన్నడ రాజ్యోత్సవం సందర్భంగా హాలీడే

నవంబర్ 10న గోవర్ధన్ పూజ, లక్ష్మీపూజ, దీపావళి సందర్భంగా షిల్లాంగ్‌లో హాలీడే

13, 14 తేదీల్లో నరక చతుర్థి, దీపావళి సందర్భంగా దాదాపు అన్ని నగరాల్లోని బ్యాంకులు మూసే ఉంటాయి.

నవంబర్ 15న భాయ్ దూజ్, లక్ష్మీ పూజ కారణంగా గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, సిమ్లాలో బ్యాంకులకు హాలీడే.

నవంబర్ 20న ఛత్ పూజ కారణంగా పాట్నా, రాంచీలో బ్యాంకులకు హాలీడే

నవంబర్ 23న డెహ్రాడూన్, షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

నవంబర్ 27న గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి కారణంగా బ్యాంకులకు సెలవులు

నవంబర్ 30న కనకదాస్ జయంతి పురస్కరించుకుని బెంగళూరులో బ్యాంకులకు సెలవు

Show Full Article
Print Article
Next Story
More Stories