Bank Holiday In July 2025: కస్టమర్లకు అలర్ట్.. జూలైలో బ్యాంకులకు ఏకంగా 13 రోజులు బంద్

Bank Holiday In July 2025 Banks To Be Closed Up To 13 Days In July
x

Bank Holiday In July 2025: కస్టమర్లకు అలర్ట్.. జూలైలో బ్యాంకులకు ఏకంగా 13 రోజులు బంద్

Highlights

Bank Holiday In July 2025: ప్రతిరోజూ బ్యాంకుల పనులు చేసుకునే చాలామంది బ్యాంకులకు వెళుతుంటారు.

Bank Holiday In July 2025: ప్రతిరోజూ బ్యాంకుల పనులు చేసుకునే చాలామంది బ్యాంకులకు వెళుతుంటారు. అయితే వీరు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే జూలైలో నెలలో దాదాపుగా 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే ఇవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. దాంతో పాటు ఆ రాష్ట్ర పండగలను బట్టి కూడా ఉన్నాయి. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్కోసారి బ్యాంకులకు ఆదివారం, రెండో, నాలుగో శనివారాలతో పాటు కొన్ని పండగలు రావడం వల్ల వరుస సెలవులు ఉంటాయి. అయితే ఈ సారి జూలైలో ఏకంగా 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి.

3–07–2025– ఖర్జీ పూజ నిమిత్తం అగర్తలాలో బ్యాంకులకు సెలవు

5–07–2025–గురు హర్ గోబింద్ పుట్టిన రోజు సందర్భంగా జమ్ముకశ్మీర్‌‌లోని బ్యాంకులు బంద్‌ ఉంటాయి

6–07–2025–ఇక ఈ రోజు ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

12–07–2025– నెలలో రెండో శనివారం కావడంతో దేశమంతా బ్యాంకులు బంద్

13–07–2025–ఆదివారణం కారణంగా బ్యాంకులన్నీ బంద్

14–07–2025–బెహ్ దీంక్లాం కారణంగా షిల్లాంగ్‌లో బ్యాంకులకు హాలీడే

16–07–2025–హరేలా పండుగ కారణంగా డెహ్రాడూన్‌లో బ్యాంకులకు సెలవు

17–07–2025– ఉ తిరోత్ సింగ్ వర్ధంతి సందర్బంగా షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేస్తారు

19–07–2025–కేర్ పూజ సందర్భంగా అగర్తలాలోని బ్యాంకులన్నింటికీ హాలీడే

20–07–2025– ఈ రోజు ఆదివారం కావడంతో అన్ని బ్యాంకులకు సెలవు

26–07–2025–ఈ నెలలో ఇది నాలుగో శనివారం అవుతుంది. అందుకుని దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు

27–07–2025–ఆదివారం కారణంగా సెలవు

28–07–2025–ద్రుక్పా షె జీ సందర్భంగా గాంగ్ టక్‌లో బ్యాంకులకు హాల్ డే

బ్యాంకులకు ఒకే నెలలో ఇన్ని సెలవులు రావడంతో కస్టమర్లు ఇబ్బంది పడవచ్చు. అందుకే బ్యాంకులకు వెళ్లి పనులు చేసుకోవాలని అనుకునేవారు.. ముందుగా జాగ్రత్తపడటం మంచిది. ఒకవేళ బ్యాంకులకు సెలవులు ఉన్న సమయంలో బ్యాంక్ లావాదేవీలు జరపాలనుకుంటే ఆన్ లైన్ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories