Bank Holiday: ఖాతాదారులకు అలెర్ట్‌.. రేపటి నుంచి ఏప్రిల్‌ 31 వరకు వరుసగా బ్యాంకులకు సెలవు..?

Bank Holiday
x

Bank Holiday: ఖాతాదారులకు అలెర్ట్‌.. రేపటి నుంచి ఏప్రిల్‌ 31 వరకు వరుసగా బ్యాంకులకు సెలవు..?

Highlights

Long bank holidays from tomorrow: బ్యాంకు ఖాతాదారులకు రేపటి నుంచి ఈ నెల చివరి తేదీ వరకు అంటే మార్చి 31 వరకు బ్యాంకు సెలవు ఉండనుంది. ఆ పూర్తి వివరాలు ఇవే..

Long bank holidays from tomorrow: బ్యాంకు ఖాతాదారులు ఏవైనా లావాదేవీలు జరపాలంటే కచ్చితంగా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లాల్సిందే. ఈ నేపథ్యంలో వారు ముందుగానే బ్యాంకులు పనిచేస్తున్నాయా? లేదా ?తెలుసుకోవాలి. అయితే రేపటి నుంచి వరుసగా రంజాన్ వరకు బ్యాంకులకు సెలవు ఉంటాయి. మార్చి 31 వరకు బ్యాంకులు ఎందుకు బంద్ ఉంటాయో తెలుసుకుందాం..

మన దేశంలో బ్యాంకులకు కొన్ని స్థానికత ఆధారంగా సెలవులు ఇస్తారు. కొన్ని ప్రత్యేక పండుగ దినాల్లో కూడా దేశవ్యాప్తంగా బ్యాంకులు హాలిడే ఉంటాయి. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేస్తుంది. అయితే, రేపటి నుంచి రంజాన్ వరకు అంటే వరుసగా ఏప్రిల్ 31 వరకు బ్యాంకులు ఎందుకు పనిచేయవు తెలుసుకుందాం..

మార్చి 27 గురువారం Shab-I-Qadr జమ్మూ కాశ్మీర్‌లో బ్యాంకులు బంద్ ఉంటాయి

ఇక మార్చి 28వ తేదీ శుక్రవారం జుమ్మా జమ్మూ కాశ్మీర్లో బ్యాంకులో బందు.

మార్చి 30 ఆదివారం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకు బ్రాంచీలకు సెలవు ఉంటుంది. ఇది మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉగాది పర్వదినం కూడా .

ఇక మార్చి 31వ తేదీ రంజాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవు రానుంది.

అయితే ఇందులో మార్చు 29 ఐదో శనివారం ఆరోజు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులు యథావిధిగా పని చేస్తాయి.

కేవలం రెండు, నాలుగో శనివారాలు మాత్రమే బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఇది కాకుండా ప్రతి ఆదివారాలు కూడా బ్యాంకులకు సెలవు.

బ్యాంకు బ్రాంచులు బంద్ ఉన్నా.. ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. అయితే పెద్ద మొత్తంలో చెక్స్ ఇతర లావాదేవీలు చేయాలంటే మాత్రం బ్యాంకు బ్రాంచీలకు వెళ్లాల్సిందే. ఇది బ్యాంకు బంద్‌ ఉన్న సమయంలో కుదరదు. ఈ నేపథ్యంలో ముందుగానే ఖాతాదారులు ఈ విషయం తెలుసుకొని జాగ్రత్త పడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories