తలసరి జీడీపీలో భారత్ ను అధిగమించిన బంగ్లాదేశ్!

కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థలో ఆందోళనకర పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. 2020 లో తలసరి జిడిపి పరంగా..
కరోనావైరస్ లాక్డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థలో ఆందోళనకర పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. 2020 లో తలసరి జిడిపి పరంగా భారతదేశం.. బంగ్లాదేశ్ కంటే దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) -వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ (డబ్ల్యుఇఒ) ప్రకారం.. 2020లో బంగ్లాదేశ్‌లో తలసరి జీడీపీ 1888 డాలర్లతో 4 శాతం వృద్ధి చెందుతుందని, భారత్‌లో తలసరి జీడీపీ గత నాలుగేళ్ల కనిష్టస్ధాయిలో 10.5 శాతం తగ్గి 1877 డాలర్లకు పడిపోతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇది గత నాలుగేళ్లలో కనిష్ట స్థాయి అని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. ఈ అంచనా ప్రకారం, భారతదేశం మూడవ పేద దేశంగా నిలుస్తుంది.. దక్షిణ ఆసియాలో పాకిస్తాన్ మరియు నేపాల్ మాత్రమే తలసరి జిడిపిని తక్కువ నమోదు చేయగా.. భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక దేశాలు మాత్రం భారత్ ను అధిగమించాయి.
డబ్ల్యుఇఒ డేటాబేస్ ప్రకారం, 2020 లో తలసరి జిడిపి 4 శాతం కుదించుకుపోయే అవకాశం ఉన్న శ్రీలంక తరువాత దక్షిణాసియాలో భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని డబ్ల్యూఈఓ గణాంకాలు స్పష్టం చేశాయి. 2020 ఆపైన పాకిస్తాన్ డేటాను ఐఎంఎఫ్ వెల్లడించనప్పటికీ, నేపాల్ , భూటాన్ ఈ సంవత్సరం తమ ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరుచుకున్నాయి. ఇక ఐఎంఎఫ్ సంస్థ వచ్చే ఏడాది భారతదేశంలో మెరుగైన ఆర్థిక పునరుద్ధరణను అంచనా వేస్తోంది, ఇది దేశ తలసరి జిడిపిని 2021 లో బంగ్లాదేశ్ కంటే చిన్న తేడాతో ముందుకు తీసుకువెళుతుందని అంచనా వేసింది. డాలర్ పరంగా భారతదేశ తలసరి జిడిపి 2021 లో 8.2 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇదే క్రమంలో బంగ్లాదేశ్ 5.4 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. గత ఐదేళ్ళలో భారతదేశం నమోదు చేసిన 3.2 శాతం వృద్ధితో పోలిస్తే.. బంగ్లాదేశ్ యొక్క తలసరి జిడిపి 9.1 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటుకు పెరిగింది.
PM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTAmit Shah: ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో అధికారం భాజపాదే
3 July 2022 1:15 PM GMTభాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
3 July 2022 2:40 AM GMTహైదరాబాద్‌లో కొనసాగుతున్న ఫ్లెక్సీ వార్.. కేసీఆర్ ఫ్లెక్సీలపై మోడీ ఫ్లెక్సీలు!
2 July 2022 1:30 PM GMTటీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్.. రూ. 96.21 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ..
2 July 2022 12:57 PM GMTమోడీకి అనేక ప్రశ్నలు సంధించిన కేసీఆర్.. రేపటి బహిరంగ సభలో జవాబులివ్వాలని సవాల్..
2 July 2022 12:30 PM GMTమోడీ భాగ్యలక్ష్మిని దర్శించుకుంటారా?
2 July 2022 11:48 AM GMT
కేసీఆర్‌ను గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు : జేపీ నడ్డా
3 July 2022 3:00 PM GMTNarendra Modi: తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోంది
3 July 2022 2:30 PM GMTPM Narendra Modi: తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ...
3 July 2022 2:09 PM GMTTelangana: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం
3 July 2022 2:00 PM GMTకళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ వేదికపైకి ప్రధాని మోదీ
3 July 2022 1:44 PM GMT