Baba Vanga 2026 Predictions: బాబా వంగా భయంకర జోస్యం.. 2026లో మూడో ప్రపంచ యుద్ధం? గ్రహాంతరవాసుల రాక!

Baba Vanga 2026 Predictions: బాబా వంగా భయంకర జోస్యం.. 2026లో మూడో ప్రపంచ యుద్ధం? గ్రహాంతరవాసుల రాక!
x
Highlights

ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వంగా 2026 గురించి చెప్పిన భయంకరమైన జోస్యాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం, ఆర్థిక మాంద్యం, ఏలియన్స్ రాక మరియు AI ఆధిపత్యం వంటి 7 కీలక అంశాలను ఆమె ముందే ఊహించారు. గతంలో ఆమె చెప్పిన చాలా విషయాలు నిజం కావడంతో ఈ జోస్యాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని, ‘బాల్కన్ నోస్ట్రాడమస్’గా పిలవబడే బాబా వంగా 2026 సంవత్సరం గురించి చెప్పిన అంచనాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టిస్తున్నాయి. గతంలో ప్రిన్సెస్ డయానా మరణం, 9/11 దాడులు, కోవిడ్ మహమ్మారి వంటి విషయాలను ముందే ఊహించిన ఆమె.. 2026లో జరగబోయే వినాశనం గురించి 7 కీలక అంశాలను వెల్లడించారు.

1. మూడో ప్రపంచ యుద్ధం (World War III)

బాబా వంగా అంచనాల ప్రకారం.. 2026లో ప్రపంచం మరో యుద్ధ గాలిని పీల్చుకోనుంది. రష్యా - అమెరికా మధ్య ప్రత్యక్ష పోరు లేదా తైవాన్‌ను చైనా ఆక్రమించుకునే క్రమంలో మహా యుద్ధం మొదలయ్యే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.

2. భీకర ప్రకృతి విపత్తులు

ఈ ఏడాది భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తాయని బాబా వంగా పేర్కొన్నారు. ఇవి కేవలం ఆస్తి నష్టమే కాకుండా, ఊహించని స్థాయిలో ప్రాణనష్టాన్ని కలిగిస్తాయని, మౌలిక సదుపాయాలను నాశనం చేస్తాయని సమాచారం.

3. ఏలియన్స్ రాక (Aliens Arrival)

2026లో మానవాళి గ్రహాంతర జీవులను (Aliens) ఎదుర్కోబోతున్నట్లు ఆమె జోస్యం చెప్పారు. ఆశ్చర్యకరంగా, ఇటీవల ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించిన '3I/ATLAS' అనే వస్తువు ఈ జోస్యానికి బలం చేకూరుస్తోంది.

4. ఆసియా ఆధిపత్యం - చైనా హవా!

ప్రపంచ రాజకీయాల్లో ఆసియా ఖండం గ్లోబల్ పవర్ సెంటర్‌గా మారుతుందని, ముఖ్యంగా చైనా ప్రపంచ దేశాలపై తన ఆధిపత్యాన్ని చాటుకుంటుందని బాబా వంగా అంచనా వేశారు.

5. ప్రపంచ ఆర్థిక సంక్షోభం (Global Economic Crisis)

2026లో ఒక పెద్ద ఆర్థిక మాంద్యం రాబోతుందని ఆమె హెచ్చరించారు. కరెన్సీ వ్యవస్థలు కుప్పకూలడం, బ్యాంకులు దివాళా తీయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

6. AI ఆధిపత్యం.. పెరగనున్న నిరుద్యోగం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మానవ మేధస్సును మించిపోతుందని, మెషిన్ల ఆధిపత్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని బాబా వంగా జోస్యం చెప్పారు.

7. రష్యాలో కొత్త శక్తివంతమైన నాయకుడు

రష్యా నుండి ఒక బలమైన మరియు శక్తివంతమైన నాయకుడు ఉద్భవిస్తాడని, అతను ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేస్తాడని ఆమె అంచనా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories