Patanjali Profits : లాభాల రికార్డును బద్ధలుకొట్టిన బాబా రాందేవ్ కంపెనీ పతంజలి

Baba Ramdevs Patanjali Breaks Profit Record, Edible Oil Drives Major Earnings Surge
x

Patanjali : లాభాల రికార్డును బద్ధలుకొట్టిన బాబా రాందేవ్ కంపెనీ పతంజలి  

Highlights

బాబా రామ్ దేవ్ స్థాపించిన FMCG కంపెనీ పతంజలి ఫుడ్స్ ఈ ఏడాది చాలా మంచి ఫలితాలు సాధించింది. పతంజలి ఫుడ్స్, రోజువారీ అవసరాలకు పనికొచ్చే ఉత్పత్తులను తయారు...

బాబా రామ్ దేవ్ స్థాపించిన FMCG కంపెనీ పతంజలి ఫుడ్స్ ఈ ఏడాది చాలా మంచి ఫలితాలు సాధించింది. పతంజలి ఫుడ్స్, రోజువారీ అవసరాలకు పనికొచ్చే ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ తన నెట్ ప్రాఫిట్‌ను 71.29% పెంచుకుని 370.93 కోట్ల రూపాయలకు తీసుకువచ్చింది. ఈ రికార్డ్ వృద్ధి 2023 ఆర్థిక సంవత్సరానికి డిసెంబరులో ముగిసిన 3వ త్రైమాసికంలో సాధించింది. గత ఏడాది ఆరు నెలలతో పోలిస్తే, 216.54 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ వచ్చినా, ఈసారి ఇది అద్భుతమైన రికార్డ్ స్థాయిలో పెరిగింది.

పతంజలి ఫుడ్స్ మొత్తం ఆదాయం 9,103.13 కోట్ల రూపాయలకు చేరింది. ఇది గత ఏడాది 7,910.70 కోట్ల రూపాయలతో పోల్చితే కాస్త ఎక్కువ. అయితే, కంపెనీ ఖర్చు కూడా పెరిగింది. ప్రస్తుతానికి కంపెనీ ఖర్చు 8,652.53 కోట్ల రూపాయలుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి ఆ ఖర్చు 7,651.51 కోట్ల రూపాయలుగా ఉంది.

ఈ రికార్డ్ ఆదాయం ఎలా సాధించారు?

పతంజలి ఫుడ్స్ ప్రకారం, వారి ఆదాయంలో అత్యధిక భాగం ఎడిబుల్ ఆయిల్ నుండి వచ్చింది. ఈ 3వ త్రైమాసికంలో ఈ విభాగం నుండి 6,717 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే సమయంలో ఈ విభాగం నుండి వచ్చిన ఆదాయం 5,483 కోట్ల రూపాయలుగానే ఉంది. అంటే, ఎడిబుల్ ఆయిల్ విభాగం నుండి ఆదాయం 23 శాతం పెరిగింది.

పతంజలి ఫుడ్స్ మార్కెటింగ్ వ్యూహాలలో కొన్ని మార్పులు చేసింది. కస్టమర్ల నమ్మకం నిలుపుకోవడానికి, కంపెనీ మార్కెటింగ్‌పై పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. డిసెంబర్ త్రైమాసికంలో పతంజలి మొత్తం ఖర్చులలో 2.5 శాతాన్ని ప్రకటనలు, విక్రయ ప్రచారాలపై ఖర్చు చేసింది. ఇది గత 10 త్రైమాసికాలలో రికార్డు స్థాయిలో ఉంది. ప్రస్తుతం ప్రముఖ సినీ నటులు శిల్పా శెట్టీ, షాహిద్ కపూర్, మహేంద్ర సింగ్ ధోని , భోజ్‌పూరి నటుడు ఖేసరి లాల్ పతంజలి బ్రాండ్ అంబాసిడర్స్‌గా చేస్తున్నారు.

పతంజలి ఫుడ్స్ కేవలం తమ సంపదను మాత్రమే పెంచుకోలేదు. తమ పెట్టుబడిదారులకు కూడా మంచి లాభం కల్పించింది. ఒక సంవత్సరం రిటర్న్‌ను చూస్తే, పతంజలి ఫుడ్స్ పెట్టుబడిదారులకు 19 శాతం రిటర్న్ ఇచ్చింది. అలాగే 5 సంవత్సరాలలో ఈ కంపెనీ 78 శాతం బంపర్ రిటర్న్ సాధించింది. ప్రస్తుతం కంపెనీ షేరు ధర 1,854 రూపాయలుగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories