యాక్సిస్‌ బ్యాంకు ఖాతాదారులకు గమనిక.. ఈ సేవలకు డబ్బులు కట్‌ అవుతున్నాయి..?

Axis Bank Charges 25 Paise per SMS for a Maximum of Rs 15 per Quarter
x

యాక్సిస్‌ బ్యాంకు ఖాతాదారులకు గమనిక.. ఈ సేవలకు డబ్బులు కట్‌ అవుతున్నాయి..?

Highlights

Axis Bank: యాక్సిస్‌ బ్యాంకు ఖాతాదారులకు గమనిక. గత రెండు రోజుల నుంచి బ్యాంకు కస్టమర్ల ఖాతాల నుంచి SMS ఛార్జీలను కట్‌ చేస్తోంది.

Axis Bank: యాక్సిస్‌ బ్యాంకు ఖాతాదారులకు గమనిక. గత రెండు రోజుల నుంచి బ్యాంకు కస్టమర్ల ఖాతాల నుంచి SMS ఛార్జీలను కట్‌ చేస్తోంది. ఒక్కసారి బ్యాలెన్స్‌ చెక్‌చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇది ప్రతి బ్యాంకు తన కస్టమర్ల నుంచి తీసుకునే ప్రత్యేక రకమైన ఛార్జీ. అది పొదుపు ఖాతా అయినా, జీతం ఖాతా అయినా లేదా మరేదైనా ఖాతా అయినా ఛార్జీ చెల్లించాల్సిందే. మీకు అందించే సేవలకు బ్యాంకులు కొన్ని ఛార్జీలను కట్‌ చేసుకుంటాయి. తాజాగా యాక్సిస్ బ్యాంక్ సాలరీ అకౌంట్‌ నుంచి కూడా SMS ఛార్జీలను వసూలు చేస్తోంది.

సాలరీ అకౌంట్‌ మెయింటెన్‌ చేసే యాక్సిస్‌ ఖాతాదారులందరికి మెస్సేజ్‌ వచ్చే ఉంటుంది. SMS హెచ్చరికల పేరుతో ఈ ఛార్జీ కట్‌ చేస్తుంది. 16 SMS హెచ్చరికల కోసం మీ ఖాతా నుంచి రూ. 4 (GSTతో) కట్‌ చేస్తుంది. ప్రస్తుతం SMS అలర్ట్ ఛార్జీ ప్రతి SMSకి 25 పైసలు త్రైమాసికంలో గరిష్టంగా రూ.15 వరకు నిర్ణయించింది. యాక్సిస్ బ్యాంక్ వెబ్‌సైట్‌ను చూస్తే 9 విభిన్న సేవలకు ఛార్జీలు ఉంటాయి. డెబిట్ కార్డ్ ఛార్జీలు, మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించకపోవడం, ఉచిత లావాదేవీ ఛార్జీలు, లావాదేవీ వైఫల్య ఛార్జీలు, లావాదేవీ ఛార్జీలు, నకిలీ పాస్‌బుక్- స్టేట్‌మెంట్ ఫీజులు, i-కనెక్ట్ నెట్ సురక్షిత పరికర ఛార్జీలు, అదనపు ఉత్పత్తి ఛార్జీలు ఉంటాయి.

పైన పేర్కొన్న ఛార్జీలను పరిశీలిస్తే అందులో మీరు ఏ ఛార్జీలు చెల్లించాలో అర్థమవుతుంది. త్రైమాసికం ముగిసేలోగా కచ్చితంగా చెల్లించాల్సిందే. డెబిట్ కార్డ్‌లకు వార్షిక లేదా కార్డ్ జారీ ఛార్జీలు ఉంటాయి. డెబిట్ కార్డ్ రీప్లేస్‌మెంట్ ఫీజు ఉంటుంది. ఇందులో వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అనే సర్వీస్ ఉంది అందులో ఎస్ ఎంఎస్ అలర్ట్స్ వస్తాయి.SMS అలర్ట్‌ల పేరుతో మీ ఖాతా నుంచి డబ్బు కట్ చేస్తుంటే ఇది ఏకీకృత ఛార్జీలో చేర్చబడిన అదే ఛార్జీ అని అర్థం. ఈ ఛార్జీలో అతి ముఖ్యమైనది మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేయకపోవడం, ఈ మొత్తం మిగిలిన ఛార్జీల కంటే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీరు నెలలో ఉచిత ఏటీఎం లావాదేవీల పరిధి దాటితే డబ్బును చెల్లించాలి. చెక్ బుక్ జారీ చేస్తే డబ్బు చెల్లించాల్సిందే. ఆటో డెబిట్ విఫలమైనా, చెక్ రిటర్న్ లేదా బౌన్స్ లేదా స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ బౌన్స్ అయినా చెల్లించాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories