RBI New Rules: డబ్బులు డ్రా చేయాలంటే.. ఇక ఏటీఎం కార్డు అవసరం లేదు? ఆర్‌‌బీఐ కొత్త రూల్స్

ATM Cash Withdrawal Without Debit Card How to Use UPI-Enabled ATMs Full Details Inside
x

RBI New Rules: డబ్బులు డ్రా చేయాలంటే.. ఇక ఏటీఎం కార్డు అవసరం లేదు? ఆర్‌‌బీఐ కొత్త రూల్స్

Highlights

RBI New Rules: ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువగా పెరిగిపోయాయి. చిన్న దానికి పెద్ద దానికి డబ్బులు వాడకాన్ని పూర్తిగా వదిలేసి.. ఆన్ లైన్ ట్రాన్స్‌ ఫర్స్ చేస్తున్నారు.

RBI New Rules: ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువగా పెరిగిపోయాయి. చిన్న దానికి పెద్ద దానికి డబ్బులు వాడకాన్ని పూర్తిగా వదిలేసి.. ఆన్ లైన్ ట్రాన్స్‌ ఫర్స్ చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు కచ్చితంగా కొంత డబ్బులు అవసరం పడుతున్నాయి. దీనికోసం బ్యాంకు ఏటీఎంలకు వెళ్లి, డెబిట్ కార్డుతో డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక నుండి డెబిట్ కార్డు అవసరం లేకుండానే డబ్బులు డ్రా చేయొచ్చు. ఆర్ బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఆ వివరాల్లేంటో చూద్దాం.

ఇప్పటివరకు డబ్బులు కావాలంటే ఏటీఎంలకు వెళ్లి డెబిట్ కార్డు పెట్టి డబ్బులు తీసుకోవాలి. కానీ ఆర్ బీ ఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇక నుంచి డబ్బులు విత్ డ్రా చేసేవాళ్లు డెబిట్ కార్డు మరిచిపోయినా లేక చేతిలో లేకపోయినా డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తోంది.

పదేళ్ల క్రితం వరకు డబ్బులు కావాలంటే ఏటీఎంలకు వెళ్లి, లైన్లలో నిలబడి డబ్బులు డ్రా చేసేవాళ్లు. అయితే ఈ మధ్య ఆన్ లైన్ చెల్లింపులు రావడంతో అన్ని లావాదేవీలు యుపీఐ ద్వారా చేసేస్తున్నారు. అయితే నగదు కూడా కొంత అవసరం పడుతుంది కాబట్టి ఏటీఎంలకు వెళ్లి డెబిట్ కార్డుతో డబ్బులు విత్ డ్రా చేయాల్సిందే. అయితే డెబిట్ కార్డు లేకుండా కార్డు రహిత లావాదేవీలను ఉపయోగించుకోవచ్చు.

మొబైల్‌ యాప్స్, గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పె వంటి యాప్‌ల సాయంతో డెబిట్ కార్డు లేకపోయినా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ ఆధారంగా డెబిట్ కార్డు లేకుండా డబ్బులు తీసుకోవచ్చు. అయితే ముందుగా ఏటీఎం స్కీర్ న్‌పై యూపీఐ కార్డ్‌ లెస్ క్యాష్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేయాలి.

అప్పుడు తాత్కాలిక క్యూఆర్‌‌ కోడ్ జనరేట్ అవుతుంది. అప్పుడు ఫోన్‌లోని బ్యాంకు యుపిఐ ఆధారిత యూప్‌తో దాన్ని స్కాన్ చేయాలి. ఆ తర్వాత యుపీఐ పిన్‌ని యాప్‌లో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఏటీఎం నుంచి డబ్బులు బయటకు వస్తాయి. అంతేకాదు మీరు డబ్బులు తీసుకున్నట్లు మీ సెల్ ఫోన్‌కు మెసేజ్ కూడా వస్తుంది. అయితే కొన్ని బ్యాంకులు కొన్ని పరిమితులు విధించాయి. దాని ప్రకారమే డబ్బులు విత్ డ్రా చేసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories