Instant Loans Rules: ఇన్​స్టంట్​ లోన్స్​ తీసుకుంటున్నారా.. ముందుస్తుగా ఈ విషయాలు గమనించండి..!

Are You Taking Instant Loans First Note These Things
x

Instant Loans Rules: ఇన్​స్టంట్​ లోన్స్​ తీసుకుంటున్నారా.. ముందుస్తుగా ఈ విషయాలు గమనించండి..!

Highlights

Instant Loans Rules: ఈ రోజుల్లో లోన్​ కావాలంటే ముందుగా అందరూ చేసే పని ఆన్​లైన్​లో ఇన్​స్టంట్​ లోన్స్​ కోసం వెతకడం.

Instant Loans Rules: ఈ రోజుల్లో లోన్​ కావాలంటే ముందుగా అందరూ చేసే పని ఆన్​లైన్​లో ఇన్​స్టంట్​ లోన్స్​ కోసం వెతకడం. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా సులువుగా లోన్లు లభిస్తున్నాయి. గతంలో మాదిరి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ దీనివల్ల చాలా సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఎందుకంటే చాలామంది ఇన్​స్టంట్​ లోన్​ కంపెనీల రూల్స్​ తెలియకుండా లోన్​ తీసుకొని తర్వాత ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి లోన్స్​ తీసుకునే మందు కొన్ని విషయాలను గమనించాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఇన్​స్టంట్​ లోన్​ కోసం తీసుకునే మందు ఆయా కంపెనీల కస్టమర్​ రేటింగ్​ చూడాలి. ఆ కంపెనీ రూల్స్​ అండ్​ రెగ్యులేషన్స్​ పరిశీలించాలి. వాటిని ఇతర కంపెనీలతో పోల్చి చూడాలి. తర్వాతే లోన్​ గురించి ఆలోచించాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే వడ్డీరేట్లు. ఇన్​స్టంట్​ లోన్లపై కంపెనీలు వడ్డీ అధికంగా వసూలు చేస్తాయి. వీటితో పాటు లేట్‌ పేమెంట్‌ ఫీజు, ప్రీ పేమెంట్‌ ఫీజు, ప్రాసెసింగ్‌ రుసుముల విధిస్తారు. వీటన్నిటి గురించి ముందుగానే తెలుసుకొని ఆ లోన్​ తీసుకోవడానికి మనం సెట్​ అవుతామో లేదో ఆలోచించుకొని తీసుకోవాలి.

కొన్ని కంపెనీలు తమకు సంబంధించిన రూల్స్​ అండ్​ రెగ్యులేషన్స్​ దాచిపెట్టి కస్టమర్లను బురిడి కొట్టిస్తాయి. అధిక వడ్డీలకు లోన్లు అంటగట్టి తర్వాత చెల్లింపుల కోసం పట్టి పీడిస్తాయి. అందుకే అలాంటి కంపెనీల గురించి కొంత రీసెర్చ్​ చేయాలి. ఈ రోజుల్లో ఆర్థిక పరిస్థితులు ఎప్పుడైనా తారుమారవుతాయి.

ఇలాంటి సందర్భంలో ఈ లోన్లు తిరిగి చెల్లించడానికి అవకాశం ఉంటుందా లేదా అనే విషయం గమనించాలి. అలాగే లోన్​కి సంబంధించిన ప్రతి విషయాన్ని మెస్సేజెస్​ లేదా ఈ మెయిల్​ ద్వారా కస్టమర్​కు తెలియజేయాలి. దీనివల్ల వారు అలర్ట్​గా ఉండే అవకాశం ఉంది. అన్నిటి కంటే ముఖ్య విషయం ఏంటంటే సులువుగా లోన్​ ఇస్తున్నారు కదా అని అవసరం లేకున్నా ఎక్కువగా తీసుకొని ఇబ్బంది పడవద్దు. ఎంత అవసరమో అంతే తీసుకొని సకాలంలో చెల్లిస్తే క్రెడిట్​ స్కోరుపై ఎఫెక్ట్​ పడకుండా ఉంటుంది. దీనివల్ల భవిష్యత్​లో మీకు మళ్లీ లోన్​ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories