Credit Card Closing: క్రెడిట్‌ కార్డ్‌ క్లోజ్‌ చేస్తున్నారా.. ఇవి గమనించండి లేదంటే నష్టమే..!

Are You Closing Your Credit Card Keep These Things In Mind Or You Will Lose A Lot
x

Credit Card Closing: క్రెడిట్‌ కార్డ్‌ క్లోజ్‌ చేస్తున్నారా.. ఇవి గమనించండి లేదంటే నష్టమే..!

Highlights

Credit Card Closing: ఈ రోజుల్లో చాలామంది ఒకటి కంటే ఎక్కువగా క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి.

Credit Card Closing: ఈ రోజుల్లో చాలామంది ఒకటి కంటే ఎక్కువగా క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే క్రెడిట్ కార్డులు మెయింటెన్‌ చేసేవారు ఆ కార్డుల వివరాలు, డ్యూ డేట్లు, చెల్లింపులు అన్ని గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ఫైన్ల మీద ఫైన్లు కట్టాల్సి ఉంటుంది. ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అందుకే చాలా మంది ఎక్కువ కార్డులు ఉంటే ఎక్కువ లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డులను ఉంచుకొని మిగతావి డీయాక్టివేట్ చేసేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం మంచిదే గానీ కొన్ని విషయాలను మాత్రం కచ్చితంగా గుర్తుంచుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

మనకి బ్యాంకులో లోన్‌ కావాలంటే ముందుగా వారుచూసేది మన క్రెడిట్‌ చరిత్ర. ఇది అనుకున్నదానికంటే ఎక్కువ ఉంటేనే మనకు లోన్‌ మంజూరవుతుంది. అయితే అధికంగా క్రెడిట్ కార్డులను వాడటం వల్ల మీకు తెలియకుండానే దీనిపై ఎఫెక్ట్‌ పడుతుంది. అనుకోకుండా క్రెడిట్‌ స్కోరు తగ్గుతుంది. దీనివల్ల భవిష్యత్‌లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

క్రెడిట్ కార్డును ఎప్పుడు క్లోజ్ చేయాలి..

చాలా క్రెడిట్ కార్డ్‌లను కలిగి ఉంటే ఉపయోగించని క్రెడిట్ కార్డ్ ను పూర్తిగా రద్దు చేసుకోవడం మంచిది. దీనివల్ల వాటి వార్షిక రుసుములు లేదా ఇతర ఛార్జీలు మిగులుతాయి. ఎందుకంటే మీరు ఉపయోగించని కార్డు కోసం చార్జీలు చెల్లించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అలాగే మీరు మీ ఖర్చులను నియంత్రించడంలో ఇబ్బంది పడుతుంటే, ఉపయోగించని క్రెడిట్ కార్డ్‌లను క్లోజ్ చేయడం గొప్ప ఆలోచన.

క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం

క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్‌ చేయడం వల్ల క్రెడిట్‌ స్కోరుపై ప్రభావం పడుతుంది. క్లోజ్‌ చేసే సమయంలో క్రెడిట్ కార్డ్‌లో బ్యాలెన్స్ ఉంటే క్రెడిట్ వినియోగ రేటులో మెరుగుదల ఉంటుంది. లేదు ఆలస్య చెల్లింపుల చరిత్ర కలిగిన క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేస్తే క్రెడిట్ స్కోర్‌కు నష్టం జరగకుండా ఉంటుంది. అయితే క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేయడం వల్ల ఎంతోకొంత క్రెడిట్ స్కోర్ పై కచ్చితంగా ప్రభావం పడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories