Anil Ambani : కుప్పకూలుతున్న అనిల్ అంబానీ షేర్లు.. ఇన్వెస్టర్లు బలి

Anil Ambani : కుప్పకూలుతున్న అనిల్ అంబానీ షేర్లు.. ఇన్వెస్టర్లు బలి
x

Anil Ambani : కుప్పకూలుతున్న అనిల్ అంబానీ షేర్లు.. ఇన్వెస్టర్లు బలి

Highlights

భారత స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం ఒక రకమైన యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఫిబ్రవరి 3న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై దిగుమతి సుంకాలను 18 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం మార్కెట్లకు భారీ ఊరటనిచ్చింది.

భారత స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం ఒక రకమైన యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. ఫిబ్రవరి 3న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై దిగుమతి సుంకాలను 18 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం మార్కెట్లకు భారీ ఊరటనిచ్చింది. సెన్సెక్స్ 3,600 పాయింట్లు ఎగబాకి ఇన్వెస్టర్లలో ఆశలు చిగురింపజేసింది. అయితే, ఈ జోష్ కేవలం ఒక్క రోజుకే పరిమితమైంది. ఫిబ్రవరి 5 నాటికి మళ్ళీ సూచీలు పతనం కావడంతో దలాల్ స్ట్రీట్‌లో బ్లాక్ ఫిబ్రవరి భయం పట్టుకుంది.

మార్కెట్ ఒడుదొడుకుల మధ్య మరీ ముఖ్యంగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీలుపాతాళానికి పడిపోతున్నాయి. ఇటీవల అనిల్ అంబానీ, ఆయన కుమారుడు జై అన్మోల్ అంబానీపై ఈడీ (ED) మనీలాండరింగ్ కేసులు నమోదు చేయడం, సుమారు రూ. 12,000 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయడం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీసింది.

గతేడాది జూన్ 2025లో రూ. 423 వద్ద ట్రేడ్ అయిన ఈ షేరు, ప్రస్తుతం రూ. 127 స్థాయికి పడిపోయింది. అంటే కేవలం 7 నెలల వ్యవధిలోనే 70 శాతం మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది.ఈ స్టాక్ కూడా తన గరిష్ఠ ధర రూ. 76 తో పోలిస్తే ఇప్పుడు రూ. 28 వద్ద కొట్టుమిట్టాడుతోంది. రోజువారీగా 2 నుంచి 5 శాతం మేర లోయర్ సర్క్యూట్లు తాకుతూ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

ట్రంప్ సుంకాలు తగ్గించినా, అమెరికా-భారత్ మధ్య ఇంకా పూర్తిస్థాయి వాణిజ్య ఒప్పందం కుదరకపోవడం , అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.ఎఫ్.ఐ.ఐ (FIIs)లు భారత మార్కెట్ల నుంచి భారీగా నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. ఇది సూచీలు కోలుకోకుండా అడ్డుపడుతోంది.అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపై సీబీఐ , ఈడీ దర్యాప్తు వేగవంతం కావడం, కోర్టులు విచారణ జాప్యంపై సీరియస్ అవ్వడం గ్రూప్ షేర్లను రెడ్ జోన్‌లోకి నెట్టేశాయి.

పెన్నీ స్టాక్స్ మరియు వివాదాల్లో చిక్కుకున్న గ్రూప్ షేర్ల విషయంలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనిల్ అంబానీ కంపెనీల భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా కోర్టు తీర్పులు మరియు దర్యాప్తు సంస్థల నివేదికలపైనే ఆధారపడి ఉంది. ఇటువంటి సమయాల్లో తొందరపడి పెట్టుబడులు పెట్టడం కంటే, మార్కెట్ స్థిరపడే వరకు వేచి చూడటం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories