కేంద్ర ఉద్యోగులకి అలర్ట్‌.. గ్రాట్యుటీ, పెన్షన్ నిబంధనలని మార్చిన ప్రభుత్వం..!

Alert to Central Employees the Government has Changed the Rules of Gratuity and Pension
x

కేంద్ర ఉద్యోగులకి అలర్ట్‌.. గ్రాట్యుటీ, పెన్షన్ నిబంధనలని మార్చిన ప్రభుత్వం..!

Highlights

Central Employees: కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం స్ట్రిక్ట్ వార్నింగ్ జారీ చేసింది.

Central Employees: కేంద్ర ఉద్యోగులకు ప్రభుత్వం స్ట్రిక్ట్ వార్నింగ్ జారీ చేసింది. ఉద్యోగ విషయంలో ఏదైనా అవకతవకలకి పాల్పడితే గ్రాట్యుటీ, పెన్షన్ నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి. నూతన నిబంధనల ప్రకారం ఉద్యోగి పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రిటైర్మెంట్ తర్వాత పెన్షన్, గ్రాట్యుటీని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వు కేంద్ర ఉద్యోగులకు వర్తిస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాలు కూడా వీటిని అమలు చేస్తున్నాయి.

సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్ 2021 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో CCS (పెన్షన్) రూల్స్ 2021లోని రూల్ 8ని మార్చి కొత్త నిబంధనలు యాడ్‌ చేసింది. కేంద్ర ఉద్యోగి ఏదైనా తీవ్రమైన నేరం లేదా నిర్లక్ష్యానికి పాల్పడితే పదవీ విరమణ తర్వాత అతని గ్రాట్యుటీ, పెన్షన్ నిలిపివేస్తారు. మారిన నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని ఉద్యోగులందరికి తెలిపింది.

ఎవరు చర్యలు తీసుకుంటారో తెలుసా?

ఉద్యోగిని నియమించిన సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యదర్శులకు పెన్షన్, గ్రాట్యుటీని నిలిపివేసే హక్కు ఉంటుంది. ఒక ఉద్యోగి ఆడిట్, అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ నుంచి రిటైర్మెంట్‌ చేసినట్లయితే అతడు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేసినట్లయితే CAGకి పెన్షన్, గ్రాట్యుటీని నిలిపివేసే అధికారం ఉంటుంది. అలాగే ఒక ఉద్యోగి రిటైర్మెంట్‌ తర్వాత పెన్షన్, గ్రాట్యుటీ తీసుకున్నట్లయితే తర్వాత దోషిగా తేలితే అతని నుంచి పెన్షన్, గ్రాట్యుటీని వసూలు చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories