Business Idea: కేవలం రూ. 20 ఖర్చుతో ఈ మెుక్కను పెంచితే.. ఏడాదికి లక్షల రూపాయలు..!

Adenium Flower Plant Business Tips Care Price Details
x

Business Idea: కేవలం రూ. 20 ఖర్చుతో ఈ మెుక్కను పెంచితే.. ఏడాదికి లక్షల రూపాయలు..!

Highlights

Business Idea: అడెనియం. ఈ పూలు చూడడానికి అచ్చం గులాబీ పూలు చూసినట్టు ఉంటుంది. గులాబీ పూలలో ఉన్నట్టే ఇందులో కూడా రకరకాల కలర్స్ , మిక్సింగ్ కలర్స్ ఉన్నాయి.

Business Idea: అడెనియం. ఈ పూలు చూడడానికి అచ్చం గులాబీ పూలు చూసినట్టు ఉంటుంది. గులాబీ పూలలో ఉన్నట్టే ఇందులో కూడా రకరకాల కలర్స్ , మిక్సింగ్ కలర్స్ ఉన్నాయి. వీటికి ఇసుక నేల, ఎండ ఉంటే చాలు చక్కగా పెరిగిపోయి పూలు పూస్తాయి. అందుకే ఈ మొక్కలను ఎడారి గులాబీ అని పిలుస్తారు. ఆఫ్రికా, అరబ్ దేశాలకు చెందిన మొక్క. కొన్నేళ్ల నుంచి ఇండియాలోనూ ఈ మొక్కల సాగు బాగా పెరిగింది. వీటికి పూసే అందమైన పూల వల్ల ఇప్పుడు జనం.. ఆఫీసుల్లోనూ, బాల్కనీల్లోనూ, టెర్రస్ లపై పెంచేందుకు బాగా ఇష్టపడుతున్నారు. మరికొంతమంది వీటిని వ్యాపారంగా కూడా మలచుకున్నారు. ఎందుకంటే ఖర్చు తక్కువ లాభం ఎక్కువ.

ఈ మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఒక రేటు. పెద్ద అయన తర్వాత మరొక రేటు ఉంటుంది. చిన్నగా ఉన్నప్పుడు ఏభై నుండి 100 ల వరకు ఖరీదు ఉంటుంది. అదే పెద్ద మొక్కను కొనాలంటే 500 నుంచి 800 వరకు ఉంటుంది. అయితే దీన్ని పెంచాలంటే ఒక పెద్ద కుండీ ఉంటే చాలు.. ఇక ఆ తర్వాత అదే పెరుగుతూ వెళిపోతుంది.

పెద్ద కుండీల్లో ఇసుక, మట్టి కలిపిన మిశ్రమంలో అడెనియం మొక్కలు నాటాలి. వీటికి పెద్దగా నీళ్లు అవసరం ఉండదు. వారానికి ఒకసారి కొంచెం నీళ్లు పోస్తే సరిపోతుంది. అయితే ఎండ ఎక్కువగా అవసరం ఉంటుంది. ఈ మధ్య కాలంలో టెర్రస్ పైన , బాల్కనీలలో కూడా అడెనియం మొక్కలను బాగా పెంచుతున్నారు.

కొంతమంది దీన్ని వ్యాపారంగా చేసుకున్నారు. ఎందుకంటే ఒకసారి పెద్దగా పెరిగిన మొక్క నుంచి చాలా పిలకలు వస్తాయి. అలాగే వీటి కొమ్మలతో రీప్లాంట్ కూడా చేయొచ్చు. అలాగే వీటికి వచ్చే మొగ్గల్లో విత్తనాలు ఉంటాయి. వీటిని నారు వేయొచ్చు. ఇలా మూడు రకాలుగా ఒక మొక్కకు చాలా మొక్కలు వస్తాయి. ఈ చిన్న చిన్న మొక్కలను కుండీల్లో వేసి పెంచాలి. ఈ మొక్క గరిష్టంగా 42 డిగ్రీల సెల్సియస్ , కనీసం 10 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. దీని సాగుకు పెద్దగా శ్రమ అలాగే ఖర్చు ఉండదు. ఒక 20 రులు ఖర్చుపెడితే చాలు అడెనియం మొక్క తయారైపోతుంది. దీనిని మార్కెట్లో చిన్న మొక్క అయితే 150 నుండి 400 ఉంటుంది. అదే పెద్ద మొక్క అయితే 500 నుండి 800 వరకు ఉంటుంది. కాస్తంత డబ్బులు పెట్టుబడి పెట్టుకుని ఎవరైనా వీటిని పెంచొచ్చు. వ్యాపారం చేసేయొచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories