IT Jobs: ఉంటే ఉండండి..లేదంటే వెళ్లిపోండి ఉద్యోగులకు ప్రముఖ కంపెనీ సీరియస్ వార్నింగ్

IT Jobs: ఉంటే ఉండండి..లేదంటే వెళ్లిపోండి ఉద్యోగులకు ప్రముఖ కంపెనీ సీరియస్ వార్నింగ్
x
Highlights

IT Jobs: ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలన్నా, కెరీర్‌లో ఎదగాలన్నా ఇకపై కేవలం 'హార్డ్ వర్క్' చేస్తే సరిపోదు.. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మెరుగులు అద్దాల్సిందే.

IT Jobs: ఐటీ రంగంలో నిలదొక్కుకోవాలన్నా, కెరీర్‌లో ఎదగాలన్నా ఇకపై కేవలం 'హార్డ్ వర్క్' చేస్తే సరిపోదు.. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మెరుగులు అద్దాల్సిందే. ప్రముఖ గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ తన ఉద్యోగులకు పంపిన అంతర్గత ఈమెయిల్ ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో హాట్ టాపిక్ అయింది.

పదోన్నతిపొందాలంటే కేవలం ప్రాజెక్టులు పూర్తి చేస్తే సరిపోదని, విధిగా AI టూల్స్‌ను వాడాలని కంపెనీ స్పష్టం చేసింది. ముఖ్యంగా సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్ల స్థాయి అధికారులకు ఇది అగ్నిపరీక్షగా మారింది. భవిష్యత్తులో లీడర్‌షిప్ పాత్రలు పోషించాలనుకునే వారు తమ రోజువారీ పనిలో AIని అంతర్భాగం చేసుకోవడం తప్పనిసరి.

ఉద్యోగులు ఏఐని ఎంతవరకు వాడుతున్నారో తెలుసుకునేందుకు కంపెనీ ప్రత్యేకంగా ట్రాకింగ్ చేస్తోంది.ఉద్యోగులు ఈ టూల్‌కు వారానికి ఎన్నిసార్లు లాగిన్ అవుతున్నారు?అందులో ఎంత సేపు గడుపుతున్నారు?ఈ వివరాలన్నీ ప్రమోషన్ ఇచ్చే ముందు కంపెనీ క్షుణ్ణంగా పరిశీలించనుంది.AIని అందిపుచ్చుకోని వారు లేదా నేర్చుకోవడానికి ఆసక్తి చూపని వారు కంపెనీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుందని కంపెనీ CEO జూలీ స్వీట్ తెలిపారు.

యాక్సెంచర్ తన 7.8 లక్షల మంది ఉద్యోగులకు ఇప్పటికే జనరేటివ్ ఏఐపై భారీగా శిక్షణ ఇస్తోంది. ఇందుకోసం ఏడాదికి సుమారు రూ. 8,300 కోట్లు ఖర్చు చేస్తోంది. తమ ఉద్యోగులను కేవలం వర్కర్లుగా కాకుండా రీఇన్వెంటర్లు అని పిలవాలని నిర్ణయించింది. అంటే నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ తమను తాము అప్‌డేట్ చేసుకునే వారే ఇకపై ఐటీ రంగంలో రాజులు.

సాధారణంగా సీనియర్ ఉద్యోగులు కొత్త టెక్నాలజీ వైపు మొగ్గు చూపడానికి కాస్త వెనుకాడుతుంటారు. కానీ, యాక్సెంచర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు అందరూ తమను తాము మార్చుకోక తప్పని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ మారుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories