Aadhar: ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో ఇలా ఇంట్లోనే లింక్ చేసుకోండి..

Aadhar And Voter ID Link
x

Aadhar: ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో ఇలా ఇంట్లోనే లింక్ చేసుకోండి..

Highlights

Aadhar And Voter ID Link: మన దేశంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి అవసరం. ఈ నేపథ్యంలో ఇది ప్రతి ఒక్క పౌరులు ఈ కార్డును కలిగి ఉంటాడు. ఇది మన దేశంలో ఒక గుర్తింపు కార్డు అయితే ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో జత చేయాల్సి ఉంటుంది.

Aadhar And Voter ID Link: మన దేశంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి అవసరం. ఈ నేపథ్యంలో ఇది ప్రతి ఒక్క పౌరులు ఈ కార్డును కలిగి ఉంటాడు. ఇది మన దేశంలో ఒక గుర్తింపు కార్డు అయితే ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో జత చేయాల్సి ఉంటుంది.

మన దేశంలో ఏ ఆర్థిక లావాదేవీలు నిర్వహించాలన్నా మన దేశంలో ఆధార్ కార్డు తప్పనిసరి. స్కూల్ అడ్మిషన్ నుంచి బ్యాంకు లావాదేవీల వరకు ఆధార్ కార్డు తప్పనిసరి. అయితే ఆధార్ కార్డు మన దేశంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉంటారు. ఇది ఒక గుర్తింపు కార్డు అని చెప్పాలి. ఆధార్ కార్డు ఓటర్ ఐడీతో లింక్ చేయాలి. అయితే ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేయమని ఎన్నికల సంఘం గతంలో ఆదేశించింది.

అయితే ఆధార్ కార్డు ఎలా లింక్ చేయాలో తెలియక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అయితే NVSP పోర్టల్‌ ద్వారా, ఎస్ఎంఎస్ ఇలా ఎన్నో విధాలుగా ఆధార్ కార్డును ఓటర్ ఐడీతో లింక్ చేయవచ్చు.

ఆధార్ కార్డును NVSP పోర్టల్ లో లింక్ చేయవచ్చు. దీనికి మీ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ ఓటీపీ వస్తుంది. దాని ద్వారా మీరు ఆధార్ ఓటర్ ఐడీతో లింక్ చేయాల్సి ఉంటుంది. దీనికి 6బీ అనే ఫారంపై లింక్ చేయాల్సి ఉంటుంది. అందులో మీ EPCI నంబర్ ద్వారా ఫారం నింపి లింక్ చేయాలి.

ఇది కాకుండా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఇన్ స్టాల్ చేసి కూడా లాగిన్ చేయాలి. తద్వారా ఓటర్ ఐడీ లింక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఇక్కడ కూడా ఫారం 6బి సెలెక్ట్ చేసుకుని స్టార్ బటన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్ మొబైల్ నెంబర్ టైప్ చేసి ఓటర్ ఐడీని లింక్ చేయాల్సి ఉంటుంది.

ఇక మీరు ఎస్ఎంఎస్ ద్వారా మీ ఆధార్ ఓటర్ ఐడీని లింక్ చేయాలంటే సింపుల్‌గా ఈపీఐసి _ 166 లేదా 51969 నంబర్ కు ఎస్ఎంఎస్ పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ ఓటర్ ఐడీని లింక్ చేయడానికి మీరు 1950 నెంబర్‌కు కాల్ చేయాలి . ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆధార్ ప్రతినిధితో ఈ రెండు కార్డులను అనుసంధానం చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories