Hyderabad: బ్యూటీ ప్రొఫెషనల్స్‌కు మార్గదర్శి.. వీలైక్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ అకాడమే..

Hyderabad: బ్యూటీ ప్రొఫెషనల్స్‌కు మార్గదర్శి.. వీలైక్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌ అకాడమే..
x
Highlights

యూసుఫ్‌గూడలోని వీలైక్ మేకప్ అండ్‌ హెయిర్ అకాడమీ.. బ్రైడల్ మేకప్, హెయిర్ స్టైలింగ్, కాస్మెటాలజీ, స్కిన్‌కేర్, వెల్‌నెస్‌లో నైపుణ్యం పెంపొందించడానికి ప్రత్యేక సదస్సును నిర్వహించింది.

యూసుఫ్‌గూడలోని వీలైక్ మేకప్ అండ్‌ హెయిర్ అకాడమీ.. బ్రైడల్ మేకప్, హెయిర్ స్టైలింగ్, కాస్మెటాలజీ, స్కిన్‌కేర్, వెల్‌నెస్‌లో నైపుణ్యం పెంపొందించడానికి ప్రత్యేక సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ ముమైత్ ఖాన్, కో ఫౌండర్స్ కేయిత్, జావేద్, మేకప్ ఆర్టిస్టులు జ్యోతి, అక్స ఖాన్, సింగర్ రోల్ రైడా, డ్యాన్స్ మాస్టర్ జోసఫ్ పాల్గొన్నారు.

వీలైక్ అకాడమీ సమగ్ర పాఠ్య ప్రణాళిక, ఆధునిక సదుపాయాలు, పరిశ్రమలో అనుభవజ్ఞులైన బోధకులతో నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడుతుంది. "బ్యూటీ రంగం పై ఆసక్తి ఉన్నవారిని ప్రేరేపించడం, ప్రపంచ స్థాయి ట్రెయినింగ్ అందించడమే మా లక్ష్యం" అని ముమైత్ ఖాన్ ఈ సందర్భంగా తెలిపారు.

విద్యార్థులకు నైపుణ్యం, సృజనాత్మకత పెంపొందించేందుకు ప్రయోగాత్మక శిక్షణ, వ్యక్తిగత మార్గదర్శకత్వం, తాజా పరిశ్రమ పోకడలు అందించడంపై అకాడమీ దృష్టి సారిస్తోంది. "కేవలం కోర్సులు కాకుండా, ప్రాక్టికల్స్ ద్వారా మార్కెట్‌లో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం" అని కో-ఫౌండర్స్ కేయిత్, జావేద్ తెలిపారు.

వీలైక్ అకాడమీ బ్రైడల్ హెయిర్ అండ్‌ మేకప్.. హెయిర్ స్టైలింగ్, మేకప్ ఆర్టిస్ట్రీ, స్కిన్‌కేర్ ట్రీట్మెంట్స్, నెయిల్ టెక్నాలజీ వంటి ప్రొఫెషనల్ కోర్సులను అందిస్తోంది. ప్రతి కోర్సును సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. కేవలం శిక్షణ కాకుండా, కలిసికట్టుగా నేర్చుకునే వాతావరణాన్ని కూడా వీలైక్ ప్రోత్సహిస్తోంది. విద్యార్థులందరూ తమ ప్రత్యేక శైలి కనుగొనేందుకు, నేర్చుకున్న దాన్ని వ్యక్తీకరించేందుకు ఇదొక అనువైన వేదికగా మారుతోందని సంస్థ పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories