బెట్టింగ్ యాప్‌ కేసు: విజయ్ దేవరకొండ టీమ్ వివరణ ఇదీ...

Vijay devarakonda team responds on FIR in Miyapur police station
x

బెట్టింగ్ యాప్‌ కేసు: విజయ్ దేవరకొండ టీమ్ వివరణ ఇదీ...

Highlights

ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న వాటికే పనిచేశారని విజయ్ దేవరకొండ టీమ్ మీడియాకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న వాటికే పనిచేశారని విజయ్ దేవరకొండ టీమ్ మీడియాకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే విజయ్ దేవరకొండ పనిచేస్తున్నారని ఆ ప్రకటనలో తెలిపారు. ఏ కంపెనీకి పనిచేసినా, అడ్వర్ టైజ్ మెంట్ లో పనిచేసినా ఆ సంస్థ న్యాయపరంగా వ్యవహరిస్తున్నారా లేదా అన్నది విజయ్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ఆ టీమ్ వివరించింది.

ఏదైనా లేదా ఉత్పత్తి చట్టప్రకారం అనుమతి ఉందని తెలిసిన తర్వాతే విజయ్ దేవరకొండ వాటికి ప్రచారకర్తగా ఉంటారని చెప్పారు. ఇలాంటి అనుమతులున్నాయని తెలిసిన తర్వాత ఏ23 సంస్థ బ్రాండ్ కు విజయ్ అంబాసిడర్ గా పనిచేసినట్టు ఆయన టీమ్ వివరించింది. ఏ 23 అనే కంపెనీతో విజయ్ తో ఒప్పందం గత ఏడాదితో ముగిసిన విషయాన్ని విజయ్ దేవరకొండ టీమ్ గుర్తు చేసింది. ఈ సంస్థతో విజయ్ దేవరకొండకు సంబంధం లేదని తెలిపింది. మీడియాలో ప్రసారమౌతున్నట్టు నిబంధలకు విరుద్దంగా పనిచేస్తున్న ఏ సంస్థకు ఆయన ప్రచారకర్తగా ఆయన వ్యవహరించలేదని విజయ్ దేవరకొండ టీమ్ తెలిపింది.

బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేశారనే ఆరోపణలతో హైదరాబాద్ మియాపూర్ పోలీస్ స్టేషన్ లో విజయ్ దేవరకొండ సహా పలువురు సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ పోలీస్ స్టేషన్ తో పాటు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో 11 మందిపై కేసు నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories